CBI Raids : ఏపీ సహా దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. బాలలపై కన్నేసిన మృగాళ్లే టార్గెట్ !
బాలల పోర్న్ వీడియోలు సర్క్యూలేట్ చేస్తున్న వారిపై సీబీఐ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎంత మందిని అరెస్ట్ చేశారన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు కారణం అవుతున్న అంశాలపై ఉక్కుపాదం మోపేందుకు దర్యాప్తు సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలను అరికట్టడానికి సీబీఐ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై కొరడా ఘుళిపించించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసిన సీబీఐ 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Allegations of online child sexual abuse & exploitation | CBI is conducting searches at around 76 locations in 14 States/UTs. These States/UTs include-Andhra Pradesh, Delhi, UP, Punjab, Bihar, Odisha, Tamil Nadu, Rajasthan, Maharashtra, Gujarat, Haryana, Chhattisgarh, MP,Himachal
— ANI (@ANI) November 16, 2021
Also Read : తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..
దాడులు నిర్వహించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. తమిళనాడు, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో సీబీఐ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పలు వీడియోలను కూడా సీజ్ చేసింది. చిన్నారుల పోర్న్ వీడియోలను చూడటం, డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేయడం లాంటివాటిని కేంద్రం ఇప్పటికే నిషేధించింది. ఇంటర్‌నెట్‌లో నెట్‌లో అశ్లీల చిత్రాలు.. చైల్డ్ పోర్న్ సైట్స్ కోసం సెర్చ్ చేసే వారిపై నిఘా పెట్టింది.
Also Read : గంజాయి స్మగ్లింగ్‌కు అంతం లేదా ? లారీలకు లారీలు ఏపీ సరిహద్దులు ఎలా దాటుతున్నాయి ?
ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌లో చైల్డ్ సెక్స్ అభ్యుజ్ మెటీరియల్ అనే ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. నెట్‌లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడమే ఈ సెల్ పని. కేవలం చైల్డ్ పోర్న్ సైట్స్ చూడటమే కాదు.. గూగుల్‌లో చైల్డ్ పోర్న్ అని టైపి చేసినా వెంటనే వాళ్లకు ఇన్‌ఫర్‌మేషన్ వెళ్తుంది. గత సెప్టెంబర్‌లో ఇలా బాలల అశ్లీలలతకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూస్తున్న 16 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను ఐపీ అడ్రస్‌లతోసహా క్రైమ్ బ్యూరో రికార్డ్స్ బ్యూరో పంపింది.
Also Read : ఒక్క బండి - 117 చలాన్లు..! దొరికితే ట్రాఫిక్ పోలీసులు వదులుతారా ?
ఇప్పుడు నేరుగా సీబీఐ రంగంలోకి దిగింది. చూస్తున్న వారిని కాకుండా నేరుగా కంటెంట్‌తో వ్యాపారం చేస్తున్న వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి