AP Ganja Smuggling : గంజాయి స్మగ్లింగ్‌కు అంతం లేదా ? లారీలకు లారీలు ఏపీ సరిహద్దులు ఎలా దాటుతున్నాయి ?
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా విశాఖ పేరునే ఆయా రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు. లారీల్లో గంజాయి బయటకు వెళ్తున్నా ఏపీలో ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ?
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అక్కడి పోలీసు అధికారులు అందరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైపే చూపిస్తున్నారు. విశాఖ అంటే దేశంలోనే ఓ ప్రత్యేకమైన పర్యాటక, విశిష్టమైన ప్రాంతంగా గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు తరచూ గంజాయి స్మగ్లింగ్ పేరుతో వార్తల్లోకి వస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది ? ఏపీ నుంచి గంజాయి బయటకు వెళ్లకుండా సరిహద్దుల్లోనే ఆపలేకపోతున్నారా...? ఎక్కడ తప్పు జరుగుతోంది..?
ఒక్క రోజే రెండు చోట్ల రెండున్నర వేల కిలోల గంజాయి పట్టివేత !
సోమవారం హైదరాబాద్, మహారాష్ట్రల్లో అధికారులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. మొత్తంగా రెండున్నర వేల కేజీల వరకూ గంజాయి ఉంటుంది. ఈ రెండు చోట్లా గంజాయి ఏపీ నుంచే వస్తోందని అధికారులు ప్రకటించారు. విశాఖకు చెందిన వారిని అరెస్ట్ చేశారు. అయితే ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయి ఏపీ నుంచే వస్తోందని అక్కడి పోలీసులు నేరుగా ప్రకటించారు. పలుమార్లు అక్కడి పోలీసులు విశాఖ వచ్చి స్మగ్లర్ల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కూడా నిర్వహించారు. కానీ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదని పట్టుబడుతున్న గంజాయి ఘటనలతోనే తేలిపోతోంది.
Also Read : ఒక్క బండి - 117 చలాన్లు..! దొరికితే ట్రాఫిక్ పోలీసులు వదులుతారా ?
డ్రగ్స్‌పై ఏపీలో రాజకీయ దుమారం - పోలీసుల తనిఖీలు ముమ్మరం !
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల కిందట గంజాయి, డ్రగ్స్ విషయంలో పెద్ద దుమారం రేగింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు దాడుల వరకూ వెళ్లాయి. డీజీపి సవాంగ్ గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకమైన వ్యూహం పన్నామని ప్రకటించారు. రాజమండ్రిలో ఎస్పీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖలో ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కానీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఏపీలో పోలీసులకు పట్టుబడుతున్న గంజాయి కంటే.. ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా దొరుకుతోంది. లారీలకు లారీలు లోడ్లు బయటకు పోతున్నాయి. సరిహద్దులు స్వేచ్చగా దాటిపోతున్నాయి.
Also Read : వీడియో కాల్‌లో టెంప్ట్ అయిన యువకుడు.. న్యూడ్‌గా చాట్, చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్!
చివరికి గంజాయి ఆన్ లైన్ మార్కెటింగ్ కూడా !
విశాఖ గంజాయి స్మగ్లర్లు ఎంత తెలివి మీరిపోయారంటే చివరికి ఆన్ లైన్ బిజినెస్‌నూ వాడుకుంటున్నారు. అమెజాన్‌లో రవాణా చేయడం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. అమెజాన్‌తో సరుకుల పేరుతో బుక్ చేసి మధ్యప్రదేశ్‌కు గంజాయి పంపుతున్నారు. ఇలా వెయ్యి కేజీలకుపైగానే పంపినట్లుగా గుర్తించారు. ఇలా అన్ని రకాలుగానూ ఏపీ పేరు గంజాయి విషయంలో చర్చనీయాంశం అవుతోంది.
Also Read : మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా
మన్యం నుంచి రవాణాను కట్టడి చేయడం అంత కష్టమా ?
విశాఖ మన్యం నుంచే గంజాయి సరఫరా అవుతోంది. అక్కడ రవాణాపై పోలీసులు దృష్టి పెడితే భారీ మొత్తంలో రవాణా చేయడం అసాధ్యం అన్నది ఎక్కువ మంది చెప్పే మాట. అయితే కారణం ఏమిటో కానీ భారీ ఎత్తున గంజాయి సులువుగా రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో బయట రాష్ట్రాల్లో పట్టుబడుతున్న గంజాయి ఏపీ పోలీసుల కళ్లకు మాత్రం ఎందుకు కనిపించడం లేదనేది పెద్ద మిస్టరీ. మన్యంలో వందల కొద్దీ రోడ్లు ఏమీ ఉండవు. పరిమితమైన రహదారులే ఉంటాయి. అంత పెద్ద మొత్తంలో తీసుకు రావాలంటే వాహనాలు కావాల్సిందే. అవన్నీ పోలీసుల్ని దాటుకునే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయన్నది చాలా కాలంగా విపక్షాలు సైతం ప్రశ్నిస్తున్న మాట.
Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి