అన్వేషించండి

తల్లితో వివాహేతర సంబంధం- కూతురిపై అత్యాచారం- 74 ఏళ్ల వృద్ధుడి పరిస్థితి ఏమైందంటే?

74ఏళ్ల వృద్ధుడు, పైగా ఆధ్యాత్మిక దారిలో ఉన్నాడు. కానీ అతనో నీచుడు. వావీ వరసలు తెలియని కామాంధుడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. చివరకు ప్రియురాలే అతడిని హతమార్చింది.

కూతురి కోసం ప్రియుడిని హత్య చేసింది. ఇదేదో సినిమా స్టోరీ కాదు. నెల్లూరులో జరిగిన క్రైమ్‌ కథా చిత్రం. ఓ హత్య కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో ఆరు నెలల కిందట ఈ హత్య జరిగింది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన కూరపాటి వెంకయ్య వయసు 74 సంవత్సరాలు. కసుమూరు కొండపై అతను దర్గా నిర్వహిస్తున్నాడు. అక్కడే నివాసం ఉండేవాడు. దర్గాకు వచ్చే భక్తుల వద్ద డబ్బులు తీసుకుని, దర్గా నిర్వహణ చూసుకునేవాడు.

అలా ఆధ్యాత్మికతలో ఆ వెంకయ్య ఉండి ఉంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ ఆధ్యాత్మికత పేరుతో ఆ వ్యక్తి వక్రమార్గం పట్టాడు. దర్గాకు సమీపంలో ఉండే ఓ మహిళతో వెంకయ్య సన్నిహితంగా ఉండేవాడు. భర్తలేని ఆ మహిళ జీవనాధారం కోసం వెంకయ్యపై ఆధారపడింది. ఆమె ఇంట్లోనే నివశించేవాడు వెంకయ్య. ఆ కుటుంబం బాగోగులు చూసుకునేవాడు.

దీనిపై ఊరిలో రకరకాల స్టోరీలు వినిపించేవి. ఆ ఫ్యామిలీకి దిక్కుగా ఉన్నాడులే అనుకొని మరికొందరు సరిపెట్టుకున్నారు. ఆ మహిళ ఫ్యామిలీ కూడా అలానే అనుకుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అక్కడితో ఆగిపోలేదు. సదరు మహిళకు యుక్త వయసు కుమార్తె ఉంది. ఆమెపై కన్నేశాడు వెంకయ్య. లైంగికంగా ఆమెను నిత్యం వేధించేవాడు.

పలుమార్లు హెచ్చరించినా..

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకయ్యను... తన కుమార్తె జోలికి రావద్దని ఆ మహిళ పలుమార్లు హెచ్చరించింది. తన కుమార్తెను చెడు దృష్టితో చూడొద్దని వేడుకుంది. అయినా జరుగుబాటు లేకపోవడంతో ఆయన్ను దూరం పెట్టలేకపోయింది. వృద్ధుడైనా అతడిని భరిస్తూ, సహిస్తూ జీవనం కొనసాగించేది. ఆ ఊరి నుంచి వెళ్లిపోలేక, స్థానికంగా ఆర్థిక వసతి లేక ఇబ్బంది పడేది. ఇదే అదనుగా వెంకయ్య చాలాసార్లు మనవరాలు వయసున్న ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తల్లి, కూతురు ఇద్దరూ కలసి ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు లేదు.

చివరకు హత్య..

చివరకు ఓ రోజు తెల్లవారు జామున యువతిపై అత్యాచారం చేయబోయాడు వెంకయ్య. తల్లి బహిర్భూమికి వెళ్లగా వెంకయ్య ఆ యువతిపై లైంగిక దాడికి సిద్ధమయ్యాడు. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇంటికి తిరిగొచ్చింది. కూతురిపై అత్యాచారం చేయబోతున్న వెంకయ్యను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్రతో వెంకయ్యను కొట్టింది. ఆ దెబ్బతో అతను కిందపడిపోయాడు. అయితే ఆ గ్రహంతో ఉన్న ఆమె కిందపడిన వెంకయ్యపై రాయితో దాడి చేసింది. రాళ్లతో మోది హత్య చేసింది. అక్కడికక్కడే వెంకయ్య చనిపోయాడు. ఆ తర్వాత తల్లి, కూతురు భయంతో అక్కడినుంచి పారిపోయారు.

ఈ హత్య జరిగి ఆరు నెలలు అవుతోంది. తల్లి, కూతురు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు వారిపై అనుమానంతో దర్యాప్తు మొదలు పెట్టారు. చివరకు వారిద్దరినీ పట్టుకున్నారు. తల్లి హత్య చేశానని అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వెంకయ్య నీచత్వం కూడా ఆమె మాటల్లో బయటపడింది. గతంలో పలుమార్లు తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని, సహించినా, భరించినా.. చివరకు హెచ్చరించినా అతని పద్ధతిలో మార్పు రాలేదని ఆమె పోలీసులకు చెప్పింది. చివరకు విధిలేని పరిస్థితుల్లో అతడిని కొట్టి చంపేసినట్టు తెలిపింది. భయంతో అక్కడినుంచి పారిపోయామని పోలీసులకు వివరించింది.

వెంకటాచలం సీఐ గంగాధర్‌ రావు, ఎస్సైలు ఈకేసును సవాలుగా తీసుకుని పలుకోణాల్లో విచారించి ఛేదించారు. ఎస్సీ విజయరావు పోలీసులను అభినందించి నగదు రివార్డులు ప్రకటించారు. డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులు అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget