ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య, ఏం కష్టమొచ్చిందో ఆ తల్లికి!
ఏ కష్టం వచ్చిందో ఓ వివాహిత తన పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఏ కష్టం వచ్చిందో ఓ వివాహిత తన పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన మానస(27) తన పిల్లలు ఐన కొడుకు బలాదిత్య(8) భవ్యశ్రీ (7) తో కలిసి బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గోదావరిలో నుండి మృతదేహాలను బయటకు తీసి పంచనామ నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద బందువుల రోదనలు అక్కడ ఉన్నవారి హృదయాలను కలచివేశాయి. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదువు అర్థం కావటం లేదని బాలిక ఉరేసుకుని ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్ఫుగొండ దారుణం చోటు చేసుకుంది. చదువు అర్థం కావటం లేదని విద్యార్థిని కావ్య (17)చదువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సదాశివనగర్ మండలం మర్కల్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది కావ్య. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిoది. సెలవులు ముగియడంతో కళాశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు కావ్య కు సూచించారు. తనకు చదువు అర్థం కావడం లేదని కాలేజీకి వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కావ్యను సముదాయించి కళాశాలకు వెళ్లడానికి ఒప్పించారు తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.... దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది కావ్య. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కావ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చదువు అబ్బటం లేదని తమకు తెలిపింది. నచ్చజెప్పాo. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలాంటి దారుణం జరిగింది అని వాపోతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాచారెడ్డి పోలీసులు.
వ్యభిచారం ముసుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు కిలేడీలు అరెస్ట్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేయగా మరొ నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుండి పోలీసులు 8వేల నాలుగు వందల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్రన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్, పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలతో కల్సి ఒక ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు కిలాడీ లేడీలు బస్టేషన్లలో బస్ స్టేషన్లో అమాయకులైన యువకులను తమ సైగలతో వారిని ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారితోపాటు ఆ విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ నగర పరిసర గ్రామాలలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆ ముఠా లోని మహిళలకు విజయ్ కుమార్ కు ఫోన్ ద్వారా రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయ్ కిలాడీ లేడీలు ఉన్న ప్రాంతానికి చేరుకోని వారితో ఉన్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.