Anchor Swetcha Death: హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి !
TV Anchor Death News | హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. తన నివాసంలో ఫ్యానుకు విగతజీవిలా వేలాడుతూ కనిపించింది స్వేఛ్చ..

Hyderabad News | హైదరాబాద్ నగరంలో ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ మృతి కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నపట్టికీ , ఫ్యానుకు వేలాడుతూ కనిపిస్తున్న ఫొటో, బెడ్ పై కాళ్లు తాకేలా ఉన్న తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే..
కుటుంబ కలహాలతో మన స్థాపానికి గురైన ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్ నగర్ లో శీలం రెసిడెన్సీ, పెంట్ హౌస్ లో జరిగింది. స్వేచ్ఛ తన కూతురు సేన అరణ్యతో కలిసి ఇక్కడ నివాసం ఉంటోంది. కొన్నేళ్ల కిందట భర్త క్రాంతి కిరణ్ తో విడాకులు తీసుకోవడంతో కొన్ని రోజులు రామ్ నగర్ లోని తల్లిదండ్రులతో కలిసి ఉంది.
నాలుగు సంవత్సరాల కిందట ఆమె తన కూతురితో కలిసి ఒంటరిగా జవహర్ నగర్ లోని శీలం రెసిడెన్సిలో పెంట్ హౌస్ కు షిఫ్ట్ అయ్యారు. జవహార్ నగర్ వచ్చిన నాటి నుండి మాజీ భర్తతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

భర్తతో విడిపోయాక ఓ స్నేహితుడితో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్వేచ్ఛ అపార్ట్మెంట్ లోని పెంట్ హౌస్ లో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ తెలిపారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే క్లూస్ టీం ను రప్పించి వివరాలు సేకరించారు. అనంతరం అమే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్‌లో నెగ్గిన స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.





















