Appalaraju gets death sentence: అప్పలరాజుకు విశాఖ కోర్టు మరణశిక్ష-ఇతను చేసిన నేరం ఎలాంటిదో తెలిస్తే ..
Crime News: ఆరుగుర్ని హత్య చేసిన అప్పలరాజు అనే వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. 2021లో అప్పలరాజు చేసిన ఘోరం సంచలనం సృష్టించింది.

Appala Raju was sentenced to death: బమ్మిడి అప్పలరాజు అనే వ్యక్తికి విశాఖ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. 021 ఏప్రిల్ 15న పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్య చేశాడు. నేర నిరూపణ కావడంతో ఉరిశిక్ష విధించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య
అప్పలరాజు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. కుటుంబ పెద్ద అయిన బమ్మిడి రమణ , ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు పిల్లలలో ఐదు నెలల పసిపాప కూడా ఉంది. గడ్డి కోసే రెండు పదునైన కొడవలితో హత్య చేశాడు.
కుటుంబ వివాదాలతో హత్యలు
అప్పలరాజు కుటుంబానికి, బమ్మిడి రమణ కుటుంబానికి దీర్ఘకాల వివాదం ఉంది. బమ్మిడి రమణ కుటుంబంలోని విజయ్ కిరణ్ అనే వ్యక్తి 2018లో అప్పలరాజు కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు అయింది. ఈ కేసు రెండు కుటుంబాల మధ్య తీవ్ర వైరానికి దారితీసింది. అప్పలరాజు ఈ హత్యలను ప్రతీకారంగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన విజయ్
రేప్ కేసు నమోదు అయిన తర్వాత విజయ్ కిరణ్ కుటుంబం విజయవాడ వెళ్లింది. అయితే స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామానికి వచ్చారు. ఓ పెళ్లి కూడా ఉండటంతో ఆ పని కూడా చూసుకుని విజయవాడ వెళ్లాలని భావించారు. తన కుమార్తె పై అత్యాచారానికి పాల్పడిన విజయ్ కిరణ్ ను చంపడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదని అప్పలరాజు అనుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విజయ్ కుటుంబ సభ్యులు ఆరుగురు మృతి చెందారు. అయితే అసలు అప్పలరాజు ఎవరిని చంపాలనుకున్నాడు.. .. ఆ విజయ్ కిరణ్ మాత్రం వేరే ఇంట్లో నిద్రపోవడంతో బతికిపోయాడు.
హత్యలు చేసి లొంగిపోయిన అప్పలరాజు
అప్పలరాజు జుత్తాడలోని బాధితుల ఇంటిలోకి ప్రవేశించి, ఆరుగురు కుటుంబ సభ్యులపై కొడవలితో దాడి చేసి, వారిని అక్కడికక్కడే హత్య చేశాడు. హత్యలు చేసిన తర్వాత స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పెందుర్తి పోలీసు స్టేషన్‌లో IPC సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. అతనిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.విశాఖపట్నం జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఆరుగురు హత్యలు, ముఖ్యంగా ఇద్దరు పసిపిల్లల ఈ కేసును "రేరెస్ట్ ఆఫ్ రేర్" కేసుగా వర్గీకరించడానికి దారితీసింది. ఇది భారతీయ చట్టంలో ఉరిశిక్షకు గురయ్యే కేసు. కోర్టు బమ్మిడి అప్పలరాజును ఆరుగురు హత్యలకు దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష విధించింది.
ఉరిశిక్ష విధించినప్పటికీ, అప్పలరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ తీర్పు హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చు, ఇది శిక్ష అమలును ఆలస్యం చేయవచ్చు.





















