Crime News: పెళ్లి చేసుకుంది భార్యను కాదు ఆమె ఆస్తిని - మొగుడి నిర్వాకం - రెండు నెలలకే ఆత్మహత్య !
TamilNadu: తమిళనాడులో పెళ్లి అయిన రెండు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు నెలల్లోనే ఆమె భర్త ఆమెకు నరకం చూపించాడు.

Tamilnadu Crime News: తమిళనాడులోని తిరుప్పూర్‌లో పెళ్లి అయిన రెండు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన తండ్రికి ఓ వాయిస్ మెసెజ్ పంపింది. అందులో ఆమె పడిన బాధనంతా వ్యక్తీకరించింది. రెండు నెలల్లోనే బతుకు మీద విరక్తి పుట్టేలా భర్త, అత్తమామలు వ్యవహరించారని కన్నీరు పెట్టుకున్నారు. భరించలేని ఒత్తిడి , బెదిరింపులను వివరించింది. వాటిని బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన తన భర్త నుండి పదేపదే ఎమోషషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది. ఈ వాట్సాప్ ఆడియో తమిళనాడులో వైరల్ అయింది. దీంతో ప్రజలు ఆ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
తిరుప్పూర్‌లో అన్నాడీఎంకే రాజకీయ నేత, పారిశ్రామికవేత్త అయిన అన్నాదురై తన కుమార్తె అన్నాదురై పెళ్లిని అత్యంత ఘనంగా చేశాడు.
రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. అల్లుడికి రూ. 70 లక్షల కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. 300 సవర్ల బంగారం ఇచ్చారు. మరో రెండు వందల సవర్ల బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2025న వరుడు కవిన్ కుమార్ (28)తో వివాహం జరిగింది.
#TamilNadu: 300 सोने के सिक्के, 70 लाख कैश, 2.5 करोड़ की शादी, इसके बाद भी ससुराल वाले दहेज क लिए करते थे परेशान, महिला ने दी जान, #CrimeNews #marriage #Latestnews #dowry #DowryHarassment #sucide pic.twitter.com/uUM2xlx1e9
— Dr.Pratibha Chandra Gupta (@pratibhachandra) June 30, 2025
వివాహం అయిన 10 రోజులకే రితన్య కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి , అత్త చిత్రాదేవి చేతుల్లో ఆమె నిరంతర శారీరక , మానసిక హింసకు గురయ్యారు. ఇంకా రెండుడ వందల సవర్ల బంగారం ఇవ్వాలని రోజూ హింసించేవారు. చిన్న చిన్న విషయాలకే అవమానించేవారు. జూన్ 28 మధ్యాహ్నం, రితన్య తలక్కరై లక్ష్మీ నరసింహ పెరుమాళ్ ఆలయానికి వెళ్లింది. ఆలయం నుండి బయలుదేరిన తర్వాత సేయూర్‌లో పురుగుమందు కొనుగోలు చేసింది. మొండిపాలయం పెరుమాళ్ ఆలయం వైపు వెళ్తూ మె తన కారును రోడ్డు పక్కన ఆపి తండ్రికి వాయిస్ మెసెజ్ పంపింది. ఆ తర్వాత పురుగు మందు తాగింది.
“A divorced daughter is way better than a dead daughter!”
— Mini (@perfectminz) June 30, 2025
27-year-old Ridhanya died by suicide in Tiruppur, Tamil Nadu, reportedly due to torture over dowry with in 2 months of getting married. She had spoken to her family about it but was told to compromise
The guilty in laws… pic.twitter.com/QPUb3anWok
స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కానీ రితన్య అక్కడికి చేరుకునేలోపే మరణించింది. కవిన్ కుమార్, ఈశ్వరమూర్తి , చిత్రాదేవిలను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. రితన్య కుటుంబం ఆసుపత్రి వద్ద రోడ్లను దిగ్బంధించి, సత్వర న్యాయం కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించింది.





















