అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్ లో రూ.5 కోట్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు, 9 మంది నేపాలీ ముఠా అరెస్ట్

Hyderabad News: సికింద్రాబాద్ లోని సింధీ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. నేపాలీకి చెందిన 9 మందిని అరెస్టు చేశారు.

Hyderabad News: సికింద్రాబాద్ లోని సింధీ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో దుండగులు రూ. 5 కోట్ల సొత్తు చోరీ చేశారు. ఈ కేసులో తాజాగా పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. నేపాల్ కు చెందిన నేరగాళ్లు వ్యాపారి ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న నేపాల్ కు చెందిన శంకర్ మాన్ సింక్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. 41 లక్షల నగదు, 2.8 కిలోల బంగారం, 18 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం 13 మంది కలిసి ఈ దోపిడీ చేయగా.. అందులో 9 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చేపట్టారు. ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 

ఈ నెల 9న చోరీ

వ్యాపారవేత్త రాహుల్ గోయల్, అతని ముగ్గురు సోదరులు సికింద్రాబాద్ లోని పీజీ రోడ్డు సింధీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. వీరంతా ఐరన్ బిజినెస్ చేస్తున్నారు. నేపాల్ కు చెందిన కమల్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా వారి అపార్ట్‌మెంట్‌ లోనే వాచ్‌మెన్‌ గా పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగను పురస్కరించుకుని రాహులో గోయల్ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌజ్ కు వెళ్లారు. రాహుల్ మరుసటి రోజు అంటే జులై 10వ తేదీన సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్ తాళాలు పగుల గొట్టి కనిపించాయి. వాచ్‌మెన్ కు కేకేసినా చప్పుడు లేదు. ఎంతకీ వాచ్ మెన్ కూడా రాలేదు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన రాహుల్ గోయల్.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న కమల్.. గోయల్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్నారు. చాలా కాలంగా పని చేస్తున్నందు వల్ల గోయల్ కుటుంబానికి కమల్ పై విశ్వాసం ఏర్పడింది. ఈ నమ్మకాన్నే కమల్ వాడుకున్నాడు. బోనాల సందర్భంగా కుటుంబం అంతా కలిసి ఇల్లు వదిలి వెళ్తున్నారని గుర్తించిన కమల్.. దొంగతనాలకు పాల్పడే నాప్ల్ గ్యాంగ్ కు సమాచారం అందించాడు. మొత్తం 13 మంది నేపాల్ ముఠా రెండు కార్లలో వచ్చారు. గోయల్ ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు కాజేశారు. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దోపిడీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాలీ ముఠా నగరం విడిచి పారిపోయింది. దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. నేపాల్ ముఠా కోసం తీవ్రంగా గాలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారంతా దేశ సరిహద్దులు దాటకముందే అరెస్టు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget