Nellore News : అబ్బాయిలపై లైంగిక దాడి, నెల్లూరులో యువకుడు వికృత చర్య!
నెల్లూరులో ఓ యువకుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. ఇద్దరు అబ్బాయిలపై లైంగిక దాడి చేశాడు. వారిద్దరితో అసహజంగా ప్రవర్తించాడు. చాక్లెట్ల ఆశ చూపి వారిద్దరిపై లైంగిక దాడి చేశాడని తెలుస్తోంది.
నెల్లూరులో ఓ యువకుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. ఇద్దరు అబ్బాయిలపై లైంగిక దాడి చేశాడు. వారిద్దరితో అసహజంగా ప్రవర్తించాడు. చాక్లెట్ల ఆశ చూపి వారిద్దరిపై లైంగిక దాడి చేశాడని తెలుస్తోంది. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
నెల్లూరు జిల్లా కావలి డివిజన్ బోగోలు మండలం కప్పారాళ్ల తిప్పలో ఈ ఘటన జరిగింది. కప్పరాళ్ల తిప్పలో రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదంతో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మైనర్ బాలురను టార్గెట్ చేసుకుని ప్రవీణ్ అనే యువకుడు వారిపై లైంగిక దాడి చేశాచు. ఆరు, ఏడో తరగతులు చదువుతున్న ఇద్దరు బాలురకు చాక్లెట్లు ఆశగా చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వికృతంగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు పోలీసులు. డీఎస్పీ వెంకట రమణ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇదే తొలికేసు..
నెల్లూరులో ఇటీవల పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఒవెల స్కూల్ లో ఓ విద్యార్థినిపై స్కూల్ పీఆర్వో లైంగిక దాడికి పాల్పడ్డాడనే కారణంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా నక్షత్ర స్కూల్ లో మరో బాలికను స్కూల్ కరస్పాండెంట్, వ్యాన్ డ్రైవర్ లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా జరిగిన ఘటనలో ఇద్దరు అబ్బాయిలు బాధితులు కావడం ఆందోళన కలిగించే అంశం.
నెల్లూరులో గతంలో ఇలాంటి వికృతాలు ఎప్పుడూ బయటకు రాలేదు. అబ్బాయిలపై అబ్బాయి లైంగిక దాడికి పాల్పడ్డాడనే వ్యవహారం వెలుగులోకి రావడంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎవర్ని నమ్మాలో, ఎవరిని నమ్మకూడతో తెలియని పరిస్థితి. అబ్బాయిలను తోటి అబ్బాయిలకు తోడుగా ఇచ్చి పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి.
మొబైల్ పోర్న్ తోనే సమస్య..
మొబైల్ చేతికి వచ్చిన తర్వాత అందులో మంచికి మాత్రమే కాకుండా, చెడుకి కూడా యువత, పిల్లలు బానిసలవుతున్నారు. మొబైల్ లో కనిపించే పోర్న్ వీడియోల వల్లే ఇలాంటి విశృంఖలత్వం పెరుగుతుందని అంటున్నారు మానసిక నిపుణులు. వాటి ప్రభావం పిల్లలపై, యువతపై చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఒంటరిగా మొబైల్ లో వీడియోలు చూడటం, నిజ జీవితంలో అలాగే ప్రవర్తించాలనుకోవడం దీనికి ప్రధాన కారణం. ఇటీవల హైదరాబాద్ లో తమతో కలసి చదువుకునే విద్యార్థినిపై కొంతమంది పిల్లలు లైంగిక దాడి చేయడం, ఆ ఘటనను వీడియో చిత్రీకరించడం తెలిసిన విషయమే. ఆ ఘటనలో కూడా సెల్ ఫోన్ దే తప్పు అని తేలింది. తండ్రి సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్న ఓ కుర్రాడు, స్నేహితులతో కలసి ఆ వీడియోలూ చూస్తూ అందులో ఉన్నట్టుగానే ప్రవర్తించాలనుకోవడం, ఆ తర్వాత తమ స్కూల్ లో చదువుకునే విద్యార్థినిపైనే లైంగిక దాడికి దిగడం తెలిసిందే. ఇప్పుడు నెల్లూరులో కూడా ఇద్దరు అబ్బాయిలపై ఓ యువకుడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు. దీనికి కారణం కుటుంబ కలహాలు అని చెబుతున్నా కూడా ఆయువకుడి మానసిక పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది.