Nellore Crime: పెళ్లి చేసుకుంటావా? లేదా? సచివాలయ ఉద్యోగికి వేధింపులు.. నెల్లూరు జిల్లాలో ఘటన..
Nellore Crime: సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. దుత్తలూరు మండలం ఏరుకొల్లు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై అదే గ్రామానికి మద్దిరెడ్డి శ్రీహరి రెడ్డి అనే వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. శ్రీహరి రెడ్డి దుత్తలూరు వైన్ షాప్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా బాధితురాలిని పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన ఆమె సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో అక్కడకు వెళ్లి విధులకు ఆటంకపరచి తను పనిచేస్తున్న కంప్యూటర్ ప్రింటర్‌ను పగలగొట్టాడు. దీంతో బాధితురాలు.. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీహరి రెడ్డి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. తనకు శ్రీహరి రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని కోరింది.
Also Read: ఈబిడ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. ఆ ముగ్గురు నేతలపై సీఐడీ నజర్.. కేసును తప్పుదోవ పట్టించేందుకేనా?
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..
ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను దుత్తలూరు సబ్ ఇన్‌స్పెక్టర్ బాజిరెడ్డి మీడియాకు వెల్లడించారు. శ్రీహరి రెడ్డి మీద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని చెప్పారు. మహిళలపై ఎలాంటి దాడులు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులకు గురైన మహిళలు ధైర్యంగా తమ దృష్టికి తేవాలని కోరారు.
Also Read: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం !
Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు