By: ABP Desam | Updated at : 08 Oct 2021 01:27 PM (IST)
మంత్రి సురేష్ దంపతులపై సీబీఐ కేసులో విచారణ కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారిపై ఉన్న ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగించాలని సీబీఐకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిమూలపు సురేష్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ ఆదిమూలపు సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారని వాదించారు. దీంతో తెలంగాణ తెలంగాణ హైకోర్టు కేసును కొట్టి వేసింది.
Also Read : హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ దాడులు.. 100 కోట్ల నగదు స్వాధీనం!
అయితే ప్రాథమిక విచారణ చేశామని చెబుతూ తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ పిటిషన్‌పై విచారణ జరిపింది. దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరపలేదని, ఆధారాలు చూపకుండా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని మంత్రి ఆదిమూలం సురేష్ దంపతుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌దవే వాదించారు. అయితే సీబీఐ మాత్రం అన్ని దర్యాప్తులు నిర్వహించామని.. సాక్ష్యాలు కూడా సేకరించామని తెలిపింది.
Also Read : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా ! లోకేష్ - ఆళ్ల హోరాహోరీలో పైచేయి ఎవరిది ?
మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసులో 120 మందికి పైగా సాక్షులను విచారణ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది. 500 కు పైగా దస్తవేజులను పరిశీలించినట్లు వెల్లడించింది. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని .. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుందని..విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల కిందట రెండు వారాల కిందట తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించింది. కేసు విచారణను కొనసాగించాలని ఆదేసించింది.
Also Read : "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !
ఆదిమూలం సురేష్ మాజీ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారని వారి ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం కనీసం ఇరవై, ముప్ఫై కోట్ల వటికి పైగా ఆస్తులు కల్గి ఉన్నారని చార్జిషీట్ వేశారు. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారని సీబీఐ పేర్కొంది.
Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం