నందూస్ వరల్డ్ జంట, యూకే వెళ్లాలనుకునే నిరుద్యోగుల నుండి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ (COS) వీసా ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
UK COS Visa Fraud India: యూకే సీఓఎస్ వీసాల పేరుతో ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ జంట నందూస్ వరల్డ్భా రీ మోసానికి పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లు వసూలు చేసిచేతులెత్తేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

- నందూస్ వరల్డ్ యూట్యూబర్ జంటపై వీసా మోసం ఆరోపణలు.
- యూకే వీసా ఇప్పిస్తామని లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదు.
- సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలుగా పేరుతో నమ్మించి మోసం.
- బాధితులు ఫోన్లకు అందుబాటులో లేరని, డబ్బులు వాపసు లేవని ఆవేదన.
Social Media Influencers Visa Scam: సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి నందూస్ వరల్డ్ పేరుతో ఓ జంట చేసే వీడియోలు చూసే ఉంటారు. నందకిషోర్, మధుమిత అనే జంట ఇటీవల ఓ సినిమాలో కూడా కనిపించారు. తాజాగా వారిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
యూకే వెళ్లాలనే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ వీసా పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న నందూస్ వరల్డ్ జంట ఈ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బాధితుల ఫోన్లకు అందుబాటులో లేకుండా పోవడంతో సోషల్ మీడియా అంతా వీరి గురించే చర్చ నడుస్తోంది.
యూకేలో స్థిరపడాలనేది ఎంతో మంది ఐటీ, నర్సింగ్, ఇతర రంగాల నిరుద్యోగుల కల. దీని కోసం వీసా పొందేందుకు అత్యంత కీలకమైన సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ (COS) ఇప్పిస్తామంటూ నందూస్ వరల్డ్ ఇన్‌స్టా హ్యాండిల్ నడిపే జంట నమ్మించినట్లుగా తెలుస్తోంది. తమకున్న సోషల్ మీడియా క్రేజ్, గ్లామర్, సినిమా పరిచయాలను అడ్డం పెట్టుకుని బాధితులకు నమ్మకం కలిగించినట్లుగా చెబుతున్నారు. తమకు యూకేలో 4 నుంచి 6 కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, తలుచుకుంటే ఎవరికైనా సీఓఎస్ వీసాలు ఇప్పించగలమని చెప్పారని.. స్వయంగా వారే కొన్ని కంపెనీలను పెట్టారని కూడా చెబుతున్నారు. ఈ నమ్మకంతో ఒక్కొక్కరి నుంచి ఏకంగా 20 లక్షల వరకు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు.
Nandu’s world.
— Ravi (@Ravi21259) May 31, 2026
Nandu_world.
The couple and their kids built good reputation over the years with videos on social media. They come from humble middle class family moved to UK built own careers over the years and also fan base on social media.
The allegations now on them seem…
సాధారణంగా ఒక ఏజెన్సీ ద్వారా వెళ్లేటప్పుడు వంద సార్లు ఆలోచించే జనాలు, తాము రోజూ స్క్రీన్‌పై చూసే సెలబ్రిటీలు కావడంతో 20 లక్షల భారీ మొత్తాన్ని వెనకాముందూ ఆలోచించకుండా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. తీరా డబ్బులు చేతికి అందిన తర్వాత, వీసాల ఊసే లేదు సరే కదా.. బాధితులు చేస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు ఈ జంట కనీసం స్పందించడం లేదని చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో తమ వాదన వినిపిస్తున్నారు.
"Nandu's World" COS (Certificate of Sponsorship) Visa Allegations:
— KumarXclusive (@KumarXclusive) June 1, 2026
According to a social media post, some individuals are alleging that money was collected from people in India with promises of obtaining UK Certificate of Sponsorship (COS)-based jobs and visas.
The post claims:… pic.twitter.com/hfQTYpdUEz
గతంలో ఖండించారు.. ఇప్పుడేమో గుసగుసలు!
వాస్తవానికి ఈ జంటపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా సీఓఎస్ వీసాల విషయంలో కొందరు వీరిని ప్రశ్నించగా.. వీరే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చి, అవన్నీ ఫేక్ అలెగేషన్స్ అని, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్నారని కొట్టిపారేశారు. కానీ, గత వారం రోజులుగా బాధితులంతా ఏకమై సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నా, ఈ సెలబ్రిటీ జంట ఇంతవరకు బయటపడలేదు సరే కదా, కనీసం ఒక చిన్న వివరణ ఇస్తూ పోస్ట్ కూడా పెట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒక్కసారి డబ్బులు పోతే తిరిగి రావడం సాధ్యమేనా?
మధ్యతరగతి కుటుంబాలకు 20 లక్షలు అంటే జీవితకాల సంపాదన. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి విదేశీ ప్రయాణం కోసం ఇచ్చిన డబ్బులు ఇప్పుడు పక్కదారి పట్టడంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఇలాంటి సైబర్ , ఇమ్మిగ్రేషన్ మోసాల్లో ఒకసారి డబ్బులు పోతే, లీగల్‌గా వాటిని రికవరీ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.తమపై వస్తున్న ఆరోపణలపై ఈ సెలబ్రిటీ జంట స్పందించి.. అసలు విషయాలపై క్లారిటీ ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తే తప్ప క్లారిటీ రాదు.
Frequently Asked Questions
నందూస్ వరల్డ్ జంటపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి?
ఈ వీసా మోసంలో ఎంత మొత్తం వసూలు చేశారు?
నమ్మకం కలిగించి, ఒక్కొక్కరి నుండి ఏకంగా 20 లక్షల వరకు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు.
బాధితులు ఎందుకు స్పందించడం లేదు?
డబ్బులు తీసుకున్న తర్వాత, వీసాల ఊసే లేదు. బాధితులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా జంట స్పందించడం లేదని తెలుస్తోంది.
ఈ జంట గతంలో ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారా?
అవును, గతంలో కూడా COS వీసాల విషయంలో కొందరు వీరిని ప్రశ్నించగా, అవి ఫేక్ ఆరోపణలని కొట్టిపారేశారు.
ట్రెండింగ్ వార్తలు





















