అన్వేషించండి

Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?

Exit Trafficking Visa Fraud: ఆస్ట్రేలియాలో ఎగ్జిట్ ట్రాఫికింగ్ చట్టం కింద ఒక భారతీయ వ్యక్తిపై కేసు నమోదైంది. భార్యను మోసగించి ఇండియాలో వదిలేసి, ఆమె వీసా రద్దు చేసినందుకు 12 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Indian origin man Australia exit trafficking charge: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారత సంతతి వ్యక్తి తన భార్యను మోసగించి, ఆమెకు తెలియకుండా వీసా రద్దు చేయించి ఇండియాలోనే వదిలేసిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో నమోదైన ఈ ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.  

ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక 35 ఏళ్ల భారత సంతతి వ్యక్తి, గర్భవతిగా ఉన్న తన భార్యను పథకం ప్రకారం ఇండియాకు తీసుకువెళ్లి, అక్కడ ఆమెను ఒంటరిని చేసి తిరిగి వచ్చినందుకు గాను ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్  అతడిని అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా రాజధాని భూభాగం  లో అమల్లో ఉన్న  ఎగ్జిట్ ట్రాఫికింగ్ చట్టాల ప్రకారం నమోదైన మొదటి కేసు ఇదే  . ఈ నేరం రుజువైతే సదరు వ్యక్తికి గరిష్టంగా 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

 నమ్మించి మోసం చేసిన వైనం 

బాధితురాలు,  నిందితుడు సెప్టెంబర్ 2024లో ప్రసవం కోసం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వెళ్లారు. అక్కడ భార్యను వదిలి, తనకు ఆఫీసులో అత్యవసర పని ఉందని, బాబు పుట్టకముందే తిరిగి వస్తానని నమ్మబలికి ఆయన ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్య ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడమే కాకుండా, ఏప్రిల్ 2025లో ఆమెకు తెలియకుండానే ఆమె ఆస్ట్రేలియా వీసా అప్లికేషన్‌ను ఫోర్జరీ పత్రాలతో రద్దు చేయించాడు. తద్వారా ఆమె తిరిగి ఆస్ట్రేలియా రాకుండా అడ్డుకుని, పసిబిడ్డతో సహా ఇండియాలోనే చిక్కుకుపోయేలా చేశాడు.   

 అమ్మ ఆస్ట్రేలియాలో.. బిడ్డ ఇండియాలో 

ఎన్నో కష్టాల తర్వాత బాధితురాలు ఆగస్టు 2025లో ఎలాగోలా ఆస్ట్రేలియా చేరుకోగలిగింది. కానీ, ఆమె కుమారుడు మాత్రం ఇప్పటికీ ఇండియాలోనే ఉండిపోయాడు. తిరిగి ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగలేదు. తనను మళ్లీ బలవంతంగా ఇండియాకు తీసుకువెళ్లి అక్కడ వదిలేస్తాడన్న భయంతో ఆమె మార్చి 2026లో పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఏఎఫ్పీ అధికారులు ఏప్రిల్ 14న నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నట్లు సమాచారం.

 అసలేమిటి ఈ  ఎగ్జిట్ ట్రాఫికింగ్  ? 

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తిని భయం, మోసం,  బలవంతం ద్వారా ఆస్ట్రేలియా వెలుపలికి పంపడం, వారి పాస్‌పోర్ట్‌లను లాక్కోవడం లేదా వీసాలను రద్దు చేయడం ద్వారా వారిపై నియంత్రణ సాధించడాన్ని  ఎగ్జిట్ ట్రాఫికింగ్ గా పరిగణిస్తారు. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. వలసదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని విదేశాల్లో అనాథలుగా మార్చే ఇలాంటి చర్యలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.

 దర్యాప్తు సంస్థల సూచన 

వలస సంబంధిత వేధింపులకు గురవుతున్న వారు తక్షణమే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం  హ్యూమన్ ట్రాఫికింగ్ వీసా ఫ్రేమ్‌వర్క్  కింద ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. దీనివల్ల బాధితులు దర్యాప్తు జరుగుతున్న సమయంలో చట్టబద్ధంగా ఆస్ట్రేలియాలో ఉంటూ న్యాయపోరాటం చేయవచ్చు. ఈ కేసు ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలు తమ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే సందేశం వెళ్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Embed widget