Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Nalgonda: కట్నం కింద తనకు ప్లాటు వద్దని డబ్బులు ఇవ్వాలని యువకుడు కాబోయే భార్యకు ఫోన్ చేసి గట్టిగా చెప్పాడు.
Nalgonda News: పెళ్లికి ముందే యువకుడి బాగోతం బయటపడింది. పెళ్లి నిశ్చయమైన కొద్ది రోజులకే యువతిని యువకుడు తీవ్రమైన వేధింపులకు గురిచేశాడు. వారు ఇద్దరు ప్రేమికులు. అప్పటి వరకూ ఎంతో ప్రేమ నటించిన యువకుడు పెళ్లి కుదిరాక అసలు స్వరూపం చూడంతో, వేధింపులు భరించలేని యువతి, వాటిని తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం స్థానిక అనుముల మండలం పంగవాని కుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంట గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పంగవాని కుంటకు చెందిన మేగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె 22 ఏళ్ల నవత. ఈమె త్రిపురారం మండలంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్ జగపతి బాబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన రెండు కుటుంబాల వారు యువతీ యువకులకు ఇటీవల ఎంగేజ్ మెంట్ జరిపించాయి. కట్నం కింద వరుడికి రూ.20 లక్షల విలువైన ప్లాటు కూడా ఇస్తామని వధువు తరపు వారు హామీ ఇచ్చారు. ఇంకా రూ.80 వేల నగదు కూడా కట్నం రూపంలో ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. అయితే, ఆ కట్నం ఇచ్చే తీరు యువకుడు జగపతి బాబుకు నచ్చలేదు.
కట్నం కింద తనకు ప్లాటు వద్దని, దాన్ని స్థానంలో ఆ ప్లాటును అమ్మి డబ్బులు ఇవ్వాలని జగపతి బాబు ఆదివారం రాత్రి నవతకు ఫోన్ చేసి గట్టిగా చెప్పాడు. ఆమె కుదరదని అనడంతో కాస్త గట్టిగా తిట్టాడు. నువ్వు పైసలు ఇప్పియ్యకుంటే చావు’ అంటూ ఘాటుగా మెసేజ్‌లు పెట్టి వేధించాడు.
రెండు రోజులుగా ఇదే వ్యవహారం సాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవత సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలి తండ్రి తన కుమార్తె చావుకు కారణం యువకుడు జగపతి బాబే అని ఆరోపించాడు. ఆ మేరకు వెంకటేశ్వర్లు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే