అన్వేషించండి

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales in Telangana: లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణలో బీర్లు ఏరులై పారుతున్నాయి. బీర్ల అమ్మకాలకు సంబంధించి తాజా లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓ పక్క తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తుంటే, వాటి నుంచి ఉపశమనం పొందడానికి లిక్కర్ ప్రియులు బీర్లు పుచ్చుకుంటున్నారు. గత ఏడాది మే నెలతో పోల్చితే ఈ ఎండాకాలం సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం అధికంగా నమోదయ్యాయి. బీర్లతో పాటు ఇతర లిక్కర్ అమ్మకాలు కూడా పెరిగాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. 

గత మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల రూపాయల బీర్ల అమ్మకాలు జరిగాయి. మార్చి నుంచి మే 14వ తేదీ వరకు మొత్తం 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ విక్రయం జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఈ మే నెలలోనే ఇప్పటిదాకా మద్యం ప్రియులు రూ.10.64 కోట్ల లీటర్ల బీరు సీసాలను తాగేశారని లెక్కలు చెబుతున్నాయి. గతంలో కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా బీర్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే ఈ సారి మాత్రం ఆ లోటును పూర్తిగా అధిగమించి పెరిగాయి. 

ఇక జిల్లాల వారీగా చూస్తే బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో రూ.2.38 కోట్ల లీటర్ల బీర్ల విక్రయం జరిగింది. రూ.1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్‌ రెండో స్థానంలో ఉంది. లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెబుతున్నాయి.

సగం వాటా బీర్లదే..
ఈ ఏడాది జనవరి - మే 15వ తేదీ వరకూ జరిగిన మద్యం విక్రయాల్లో సగానికి పైగా వాటా బీర్లదే అని ఎక్సైజ్ శాఖ లెక్కలు స్పష్టం చేశాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది మే 15 వరకూ రంగారెడ్డిలో 4,68,56,640.. హైదరాబాద్‌లో 1,74,20,700.. మేడ్చల్ జిల్లాలో 97,16,424 బీర్ల అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget