Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
చిన్నరిపాప తల్లిదండ్రులతో కలిసి మీడియాకు ముందుకు వచ్చారు కరాటే కల్యాణి. తనపై లేనిపోని నిందలేస్తున్నారని ఆరోపించారు.
Karate Kalyani with Baby Parents : తాను పిల్లల్ని ఎత్తుకుని వెళ్లి అమ్ముకుంటున్నానంటూ దారుణమైన వార్తలు ప్రచారం చేశారని సినీ నటి కరాటే కల్యాణి ( Karate Kalyani ) ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇంట్లో చైల్డ్ వేల్ఫేర్ అధికారులు తనిఖీ చేసి పిసిపాప ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆమె పసిపాపను చట్ట విరుద్ధంగా తెచ్చి పెంచుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులతో కలిసి కూకట్‌పల్లిలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై కరాటే కల్యాణి మండిపడ్డారు. ఈ వివాదం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని వారి వివరాలన్నీ బయట పెడతానన్నారు.
ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!
తనకు ముగ్గురూ ఆడపిల్లలేని పాపను పోషించలేకనే పాప భవిష్యత్ కోసమే... తాము కరాటే కల్యాణి వద్ద పెంచుతున్నామని పాప తండ్రి ( baby Father ) ప్రకటించారు. తాము కూడా పాప తల్లిదండ్రులుగానే కరాటే కల్యాణి ఇంట్లోనే ఉంటున్నామని ప్రకటించారు. లీగల్‌గా దత్తత ప్రక్రియ పూర్తయ్యే వరకూ కల్యాణి వాళ్లింట్లోనే ఉంటామన్నారు. తనకు పిల్లలు లేరని.. ఆడపిల్లలంటే ఇష్టమని అందుకే దత్తత తీసుకున్నానన్నారు. ఏడాది తర్వాత లీగల్‌గా దత్తత తీసుకుందామనుకున్నానని కల్యాణి తెలిపారు. తనకు చాలా రోజులుగా అన్యాయం జరుగుతోంది...చాలామంది మీద ఫైట్ చేస్తాను, నిలదీస్తాను, తంతాను కూడా అని ప్రకటించారు. కొన్ని రాజకీయ శక్తులు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కల్యాణి అన్నారు. అయినా తాను వెనక్కి తగ్గనని ఝాన్సీ లక్ష్మిబాయిలా ఫైట్ చేస్తానని ప్రకటించారు.
నడిరోడ్డుపై కరాటే కల్యాణి రచ్చ! యూట్యూబర్ చెంప పగలగొట్టి, గుడ్డలిప్పించి స్ట్రాంగ్ వార్నింగ్
తాను ఎలాంటి తప్పు చేయకుండా నిందలు వేస్తున్నారని కల్యాణి మండిపడ్డారు. తాను పిల్లల్ని ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నాని నిరాధార వార్తలు వేశారన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. తెలిసిన వాళ్లు ఆస్పత్రిలో ఉంటే వారి దగ్గరకు వెళ్లానన్నారు. పారిపోయినట్లుగా ప్రచారంచేశారని.. ఒక ఆడపిల్ల మీద ఇంత నీచమా.. ఇన్ని దుర్భాషలా అని ప్రశ్నించారు.
తన మీద ఫైట్ చేస్తున్నవాళ్లు ఒక్కఆడదాన్ని ఎదుర్కోలేక ఇంత చేస్తారా అని ప్రశ్నించారు.ఒక అమ్మాయిని వేధిస్తూ పోస్ట్ చేస్తే పోక్సో చట్టం కింద కేసు పెట్టారని కానీ తనను మాత్రం దారుణంగా వేధిస్తున్నరాన్నారు. పిల్లల్ని అమ్ముకునే హేయమైన స్థితిలో లేనని స్పష్టం చేశారు.