ముంబైలోని పైధూని ప్రాంతంలో ఒక కుటుంబం రాత్రి పుచ్చకాయ తిన్న తర్వాత మరణించింది. వాంతులు, విరేచనాలతో వారి ఆరోగ్యం క్షీణించింది.
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి భోజనంలో బిర్యానీ, ఆపై పుచ్చకాయ తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై చనిపోయారు.

- ముంబై పైధూనిలో పుచ్చకాయ తిన్న కుటుంబం మొత్తం మరణించింది.
- విందు తర్వాత రాత్రి పుచ్చకాయ తినడంతో కుటుంబానికి అనారోగ్యం.
- నాలుగు గంటల్లో వాంతులు, విరేచనాలతో నలుగురు మరణించారు.
- ఆహార కాలుష్యంపై అనుమానం; ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
Mumbai News: ముంబై మహానగరంలోని పైధూని ప్రాంతంలో శనివారం రాత్రి పూట తిన్న ఆహారం విషపూరితంగా మారిందా లేకా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.
ముంబైలోని పైధూని ప్రాంతంలో నివసించే అబ్దుల్లా డోకాయా, ఆయన భార్య నస్రీన్ డోకాడియా తమ ఇద్దరు కుమార్తెలు ఆయిషా, జైనాబ్‌లతో కలిసి నివసిస్తున్నారు. ఏప్రిల్ 25 శనివారం రాత్రి వారు తమ ఇంటికి బంధువులను విందుకు ఆహ్వానించారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా బిర్యానీ తిన్నారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బంధువులు వారి బంధవుల ఇళ్లకు వెళ్లిపోయారు.
Also Read:చెప్పినట్లు చేయకపోతే చంపి శవాలు మాయం చేస్తా: ఎమ్మెల్సీ అనంతబాబు.. రిమాండ్ రిపోర్టు
ఆయితే రాత్రి 1 గంట సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి పుచ్చకాయ తిన్నారు. ఇది జరిగిన కొన్ని గంటలకే అంటే తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటల మధ్య కుటుంబంలో నలుగురికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమ్యాయి. క్రమంగా వారి ఆరోగ్యం క్షీణించి తీవ్రమై నీరసానికి గురయ్యారు.
కుటుంబ సభ్యుల పరిస్థితి విషమించడంతో అదే భవనంలో నివసించే ఒక వైద్యుడు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన రెండో అంతస్తులో జరిగింది. నేను నాలుగో అంతస్తులో ఉంటాను, నేను అక్కడికి చేరుకునే సరికి కుటుంబ సభ్యులంతా మగత స్థితిలో ఉన్నారు. ఒక కుమార్తె శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆమె నాడి కొట్టుకోవడం ఆగిపోయింది.
ఆ వైద్యుడు వెంటనే ఆమెకు సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తూ, చికిత్స పొందుతూ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.
Also Read: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
ఈ ఘటనపై జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైంది. డీసీసీ ప్రవీణ్ ముండే ఈ కేసు గురించి మాట్లాడుతూ, పోస్టుమార్టం నిర్వహించాం. ఆహార నమూనాలను, శరీర భాగాల నమూనాలను శరీర భాగాల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం అని తెలిపారు.
ఆహారం విషపూరితం కావడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ హృదయ విదారక ఘటనపై ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ స్పందించారు. ముంబైలో పుచ్చకాయ తిని ఒే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, మరణానికి గల వాస్తవ కారణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Frequently Asked Questions
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఎలా మరణించారు?
మరణానికి కారణం ఏమిటని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు?
ఆహారం విషపూరితం కావడం వల్ల మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ఇతర కారణాలు కూడా ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైంది. ఆహార నమూనాలు, శరీర భాగాల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
ఈ ఘటనపై ఎవరైనా స్పందించారా?
ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఈ ఘటనపై స్పందించి, ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















