అన్వేషించండి

Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్

IT Corridor Cycling Track: ఐటీ కారిడార్‌లో అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు వాకింగ్, జాగింగ్ చేస్తున్న వారిని అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఓ యువతి ఈ సమస్యపై విడుదల చేసిన వీడియో వైరల్ అయింది.

Indecent behavior in cycling track: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు ఎక్కువైపోయారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ యువతి సైక్లింగ్ ట్రాక్ పై రన్నింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె...ఆ దృశ్యాలను రికార్డు చేసి.. భద్రతా పరమైన సందేహాలను లేవనెత్తారు. దాంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్‌గూడ సైక్లింగ్‌ ట్రాక్‌పై జరిగిన  ఈ అసభ్యకర ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.  ఉదయం ఆరు గంటలకు జాగింగ్‌కు వెళ్లిన ఒక యువతికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 6:15 గంటల సమయంలో తాను రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అసభ్యకర చేష్టలకు పాల్పడటం చూసి సదరు యువతి దిగ్భ్రాంతికి గురైంది. ఆ దృశ్యాలను తన ఫోన్‌లో  రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.                   

తాను రన్నింగ్ దుస్తుల్లో ఉన్నానని ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. కేవలం భద్రత కోసమే  సూర్యుడు వచ్చిన తర్వాత రన్నింగ్‌కు వస్తున్నా.. అయినా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని వాపోయింది. ఆఖరికి ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా ప్రజల చూపుల వల్ల తాను అభద్రతా భావానికి లోనవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఈ వీడియో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. బాధితురాలు ధైర్యంగా  సోషల్ మీడియాలో  ఫిర్యాదు చేయడాన్ని ఆయన అభినందించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలు , ఇతర ఆధారాల ద్వారా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.   

ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 100 కు డయల్ చేయాలని  పోలీసులు సూచించారు.  సకాలంలో సమాచారం అందితే నిందితులను పట్టుకోవడం సులభమవుతుంది. ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు, మీ భద్రతే మా ప్రాధాన్యత అని ఆయన నగరవాసులకు భరోసా ఇచ్చారు. పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు నిరంతర నిఘా ఉంచుతామని పోలీసులు తెలిపారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget