అన్వేషించండి

Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్

Crime News | హైదరాబాద్‌లో సోషల్ మీడియా ద్వారా బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకుని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితుడు ఆజాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్న కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫొటోలను చూపిస్తూ తాను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని నమ్మించి చాటింగ్ ద్వారా అమ్మాయిలకు దగ్గరయ్యేవాడు. తరువాత  ప్రేమ పేరుతో లోబరుచుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మందికి పైగా యువతులను అర్జున్ మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధిత యువతుల ఫిర్యాదుతో నిందితుడిపై మరో 3 కేసులు నమోదు చేశారు. మరో కేసును నార్సింగి పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై వినోద్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. 

బ్లాక్‌మెయిల్ చేసి భారీగా వసూళ్లు..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్‌లో ఉంటున్నాడు. ధనవంతుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్స్, వాచ్‌మెన్, ఇతర సిబ్బందితో పరిచయం పెంచుకుని వారికి కొంత నగదు ఇస్తూ ఆ ఇంట్లోని బాలికలు, యువతుల్ని ట్రాప్ చేసేవాడు. నిందితుడు అర్జున్ కేవలం సోషల్ మీడియా చాటింగ్‌కే పరిమితం కాలేదు. బాలికలు, యువతులతో ఏకాంతంగా ఉన్న గడిపిన సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసేవాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకున్న వారికి ఆ ప్రైవేట్ వీడియోలు చూపించి బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. వారి వద్ద నుంచి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. 

మరి ఇప్పుడెలా దొరికిపోయాడు
జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరువాత మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో ఇంటికెళ్లి బాలికను కలిసేవాడు. ఇది గమనించిన బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసులో జైలుకు వెళ్లినా, బయటకు వచ్చాక మళ్లీ ఆ బాలికను వేధించాడు. 

వారి డ్రైవర్‌ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్‌ఫోన్లలో ఆ బాలిక నిందితుడు అర్జున్‌తో తరచుగా మాట్లాడేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో నిందితుడు ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం ఇంట్లోవాళ్లకు చెబుతానంటూ డ్రైవర్‌ భార్య బాలికను బెదిరించింది. మరోవైపు అర్జున్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన రూ.29 లక్షల నగదును చోరీ చేసిన బాలిక తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న అర్జున్‌కు రూ.13 లక్షలు ఇవ్వగా, డ్రైవర్ భార్య సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. 

నార్సింగికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసం చేశాడు. గుంటూరులో కాలేజీలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్‌‌కు తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు. తరువాత  పలుమార్లు ఇద్దరూ పబ్‌లు, హోటళ్లకు వెళ్లారు. ఆ తరువాత ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి గోల్డ్ చైన్ కాజేశాడు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని, వారి చర్యలు కొంచెం భిన్నంగా, అనుమానంగా కనిపిస్తే విషయాలు ఆరాతీయాలని లేకపోతే దారుణాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Rajeev Kanakala School Controversy : రాజీవ్ కనకాలను అందుకే నిలదీశాం - స్కూల్ కాంట్రవర్సీపై NTVS రియాక్షన్... అసలేం జరిగింది?
రాజీవ్ కనకాలను అందుకే నిలదీశాం - స్కూల్ కాంట్రవర్సీపై NTVS రియాక్షన్... అసలేం జరిగింది?
Hyderabad To Visakha Trains: నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Embed widget