Mumbai Hostage Horror: ఆడిషన్స్ పేరుతో పిల్లల్ని పిలిచి బంధించి బ్లాక్ మెయిల్ - యూట్యూబర్‌ను కాల్చి చంపిన ముంబై పోలీసులు
Children Kidnapped: ముంబైలో ఓ కిడ్నాపర్.. వెబ్ సిరీస్‌లో అవకాశాల పేరుతో పిల్లల్ని అడిషన్ కు పిలిచాడు. వారందర్నీ గదిలో పెట్టి బంధించి .. డిమాండ్లు పెట్టాడు. పోలీసులు కాల్చి పడేశారు.

Mumbai Children Kidnapped at Powai Acting Studio: ముంబై పొవైలోని ఆర్‌ఏ స్టూడియోలో యాక్టింగ్ ఆడిషన్ కోసం వచ్చిన 17 మంది పిల్లలు (13-17 సంవత్సరాలు), ఇద్దరు పెద్దవాళ్లను బందీలుగా ఉంచుకున్న షాకింగ్ ఘటన బుధవారం అక్టోబర్ 30, 2025 జరిగింది. ఫిల్మ్‌మేకర్, యూట్యూబ్ నడిపే రోహిత్ ఆర్యా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోవై పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ)తో కలిసి 2:30 గంటలకు స్టూడియోలోకి దూకి, అందరినీ సురక్షితంగా రక్షించారు. మొత్తం 19 మంది బందీలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అడ్డుకోబోయిన రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది.
A tense situation unfolded at RA Studios in Mumbai’s Powai on Thursday after reports that several children attending acting classes on the first floor had been taken hostage.
— Waahiid Ali Khan (@waahiidalikhan) October 30, 2025
Parents gathered frantically outside the studio as some children were seen looking out of windows in… pic.twitter.com/BCB3XmR79L
మహావీర్ క్లాసిక్ భవనంలోని ఆర్‌ఏ స్టూడియోలో రోహిత్ పిల్లలను లాక్ చేసిన విషయంపై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. పోవై పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, ఆంబులెన్స్‌లు సైట్‌కు చేరుకున్నాయి. రోహిత్ వీడియో విడుదల చేసి, "నేను టెర్రరిస్ట్ కాదు, కొంతమందితో మాట్లాడాలి. లేకపోతే నేను, పిల్లలు అందరూ మరణిస్తాం" అని బెదిరించాడు. ఇన్‌స్పెక్టర్ విజయ్ సలుంకే టీమ్ బాత్‌రూమ్ గ్రిల్‌ను బ్రేక్ చేసి లోపలికి దూకింది. అక్కడ రోహిత్ ఆర్యను కాల్చి.. తర్వాత అందరినీ స్కూల్ బస్సులో బయటకు తీసుకువచ్చారు.
Mumbai Man Holds 20 Children Hostage In RA Studio Under Guise Of Audition
— Socially Responsible (@SocialResponse8) October 30, 2025
Rescued all children and man shot dead : Police #AskSRK #INDWvsAUSW #King #EktaParv2025#WomensWorldCup2025 pic.twitter.com/pYFbASymcF
మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది యాడ్ షూట్ కోసం ఆడిషన్‌కు వచ్చారు. రోహిత్ వెబ్ సిరీస్ డైరెక్టర్‌గా ప్రకటించుకుని, వాళ్లను లాక్ చేశాడు. స్టూడియోలో ఎయిర్‌గన్, అజ్ఞాత కెమికల్స్ కూడా ఉన్నాయి. దీంతో కాల్చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కాల్పులతో గాయడిన రోహిత్ ఆర్యను ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చనిపోయారు.
मुंबईच्या पवईतील एक#mum.baipoliceे रोहित आर्य नावाच्या व्यक्तीने जीवन संपवण्याऐवजी 17 अल्पवयीन मुलांना डांबून ठेवलं होतं. त्यांची आता सुखरूपपणे सुटका करण्यात आली आहे. पोलिसांनी मनोरुग्ण असलेल्या या आरोपीला ताब्यात घेतलं आहे. या आरोपीचा व्हिडिओ व्हायरल होतोय.#mumbai #rohitarya pic.twitter.com/50ty1FcGzq
— SakalMedia (@SakalMediaNews) October 30, 2025
పిల్లలతో సంబంధం లేదని ఆయన కొంత మందితో మాట్లాడాలని అనుకున్నట్లుగా వీడియో విడుదల చేశాడు. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని.. తనకు రాావాల్సిన డబ్బుల గురించి అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా పిల్లల్ని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





















