(Source: ECI | ABP NEWS)
Bengaluru murder: కార్ మిర్రర్‌ను తాకాడని డెలివరీ బాయ్‌ను ఢీకొట్టి హత్య - బెంగళూరులో రాక్షస జంట
Road rage: బెంగళూరులో డెలివరీ బాయ్ ని కారుతో ఢీకొట్టి చంపేశారో ఓ జంట. ఈ ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది.కారణం ఏమిటంటే వారి కారు మిర్రర్ ఆ డెలివరీ బాయ్ తగిలాడట.

Bengaluru Couple murders delivery person over a scrape to car mirror: కొన్ని కొన్ని ఘటనలు చూస్తూంటే.. మనం నిజంగా భూమి మీదే ఉన్నామా.. నరకంలో ఉన్నామా అన్న అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఇది. బెంగళూరులో ఓ జంట.. ఓ డెలివరీ బాయ్ ను కారుతో ఢీకొట్టి చంపేశారు. ఎందుకంటే వారి కారుకు ఆ డెలివరీ బాయ్ చిన్న స్క్రాచ్ పడేలా చేశాడట. ఈ ఘటన సీసీ కెమెరాోల రికార్డు అయింది.
సౌత్ బెంగళూరులోని నటరాజ లేఅవుట్‌లో ఈ హత్య జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో, దర్శన్ అనే డెలివరీ ఏజెంట్ తన గేర్‌లెస్ స్కూటర్‌పై ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా ఓ కారును చిన్నగా టచ్ చేశారు. ఆ కారులో మనోజ్ అనే వ్యక్తి తన భార్యతో వెళ్తున్నారు. కారు రైట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కొద్దిగా డ్యామేజ్ అయింది. దర్శన్ వెంటనే సారీ చెప్పి, డెలివరీ చేయాల్సి ఉందని వేగంగా వెళ్లిపోయాడు.
మనోజ్, అతని భార్య కారుతో ఆ డెలివరీ బాయ్ వెంట పడ్డారు. మనోజ్ కోపంతో కంట్రోల్ కోల్పోయి, U-టర్న్ తీసుకుని స్కూటర్‌ను ఛేజ్ చేశాడు. "అతను కారును లెఫ్ట్‌కి తిప్పి, స్కూటర్‌పై బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టాడు." అని సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఇంపాక్ట్‌తో దర్శన్ రోడ్డు మీద పడిపోయారు. CCTV ఫుటేజ్‌లో ఈ దంపతులు ఇన్‌టెన్షనల్‌గా స్కూటర్ ను ఢీకొట్టి.. తర్వాత అలా ఢీకొట్టడం వల్ల దెబ్బతిన్న కారు భాగాలు కలెక్ట్ చేసుకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. పోలీసులు మనోజ్ కుమార్ (32), కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ మనోజ్, అతని భార్య ఆరతి శర్మ (30) అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి ఉంచారు.
Road Rage Shocker from Bengaluru!
— Deepak Bopanna (@dpkBopanna) October 30, 2025
A couple accused of murdering a Zepto delivery agent after his bike dented their car. They chased him for 2 km, rammed the bike, killing him & injuring a friend riding pillion. Unaware of CCTV cameras, they returned to the spot to pick up car… pic.twitter.com/riNz8PnPG7
CCTV ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అక్సిడెంట్ కాదు, డ్రైవర్ ఇన్‌టెన్షనల్‌గా స్కూటర్‌పై దాడి చేశాడని తేల్చారు. మరో 40 నిమిషాల తర్వాత, అదే కారు మళ్లీ సైట్‌కి వచ్చింది. మాస్కులు ధరించిన దంపతులు సమీపంలో పార్క్ చేసి, ఇంపాక్ట్ సమయంలో బ్రేక్ అయిన కారు భాగాలు కలెక్ట్ చేసుకున్నారు. వెళ్లిపోతున్నప్పుడు CCTVలో వాళ్ల ముఖాలు క్లియర్‌గా క్యాప్చర్ అయ్యాయి అని పోలీసులు ప్రకటించారు.
ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించి, దంపతులను వాళ్ల ఇంటి వద్ద పట్టుకున్నారు. వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. మనోజ్ తను ఒక్కడే హత్య చేశానని.. తన భార్య ఆరతి సాక్ష్యాలు తుడిచేయడానికి వచ్చిందని చెప్పాడు.





















