UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Delhi Crime: యూపీఎస్‌సీ అభ్యర్థి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ విద్యార్థిని అమృతను 2024లోనే కుటుంబం బహిష్కరించింది. పేపర్ ప్రకటన కూడా ఇచ్చింది.

UPSC aspirant murder case Amrita was disowned by family: ఢిల్లీలో యూపీఎస్‌సీ అభ్యర్థి రామ్‌కేశ్ మీనా దారుణ హత్య కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు ముఖ్య నిందితురాలైన 21 ఏళ్ల ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని అమృత చౌహాన్‌ను ఆమె కుటుంబం 2024 జులైలోనే అధికారికంగా సంబంధాలు తెంచుకుంది. అమృత తల్లిదండ్రులు జులై 8, 2024న ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్టు పత్రికా ప్రకటన కూడాచేశారు. ఈ పత్రికా ప్రకటన కాపీని ఇప్పుడు కోర్టులో డాక్యుమెంటరీ ఆధారంగా సమర్పించారు.
అక్టోబర్ నెల ప్రారంభంలో ఉత్తర ఢిల్లీలోని గాంధీ విహార్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బొగ్గుపోయిన శరీరంగా కనిపించిన రామ్‌కేశ్ మీనా ప్రమాదవశాత్తూ చనిపోయాడని అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమృత, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్, అతని స్నేహితుడు సందీప్ కుమార్ కలిసి ఈ హత్య చేశారని పోలీసులు కనిపెట్టారు.
బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని అమృత, మే నుంచి రామ్‌కేశ్ మీనాతో సహజీవనం చేస్తోంది. రామ్‌కేశ్ ఆమె ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి, డిలీట్ చేయడానికి నిరాకరించాడు. ఇది తెలిసి ఆమె తీవ్ర అవమానానికి గురైంది. ఆగ్రహంతో మాజీ ప్రియుడు సుమిత్‌ను సంప్రదించింది. "అతన్ని చంపాలి" అని కోరింది. సుమిత్ అంగీకరించి, స్నేహితుడు సందీప్‌ను ప్లాన్‌లోకి తీసుకొచ్చాడు. అక్టోబర్ 5-6 రాత్రి ముగ్గురూ మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌లో మాస్క్ ధరించిన ఇద్దరు పురుషులు భవనంలోకి ప్రవేశించడం, తర్వాత అమృత కనిపించారు. రాత్రి 2:57 గంటల సమయంలో అమృత , యు ఒక వ్యక్తి బయటకు వెళ్లారు. కొద్ది నిమిషాల్లోనే ఫ్లాట్‌లో భారీ పేలుడు జరిగి, అన్నీ బూడిద అయ్యాయి.
शादीशुदा सुमित के चक्कर में अमृता के माता-पिता ने तोड़ दिए थे रिश्ते, उसी के साथ रामकेश को उतारा मौत के घाट @Ubaidur_r #UPSC #Delhi #RamkeshMeenaMurderCasehttps://t.co/zY7LioRZg7
— ABP News (@ABPNews) October 28, 2025
ఢిల్లీ పోలీసుల ప్రకారం, ముగ్గురూ రామ్‌కేశ్‌ను గొంతు పిసికి చంపారు. శరీరంపై నెయ్యి, నూనె, ఆల్కహాల్ పోసి, గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించారు. ఫ్లాట్‌ను లోపలి నుంచి గేట్‌లోని చిన్న రంధ్రం ద్వారా లాక్ చేశారు – ఇది యాదృచ్ఛిక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి పక్కా ప్లాన్ అమలు చేశారు. అమృత ఫోరెన్సిక్ శిక్షణ ఆమెకు కవరప్ ప్లాన్ రూపొందించడంలో సహాయపడింది. మొదట ఏసీ పేలుడుగా అనుమానించినా, కాలిన ఆకారం, సీసీటీవీ ఆధారాలు సందేహాలు రేకెత్తించాయి.
అమృత మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులు ఆమె నేరాన్ని వెలుగులోకి తెచ్చాయి. అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఇంటరాగేషన్‌లో ఆమె నేరాన్ని ఒప్పుకుంది. అక్టోబర్ 21న సుమిత్, 23న సందీప్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, రెండు మొబైల్ ఫోన్లు, రామ్‌కేశ్ షర్ట్ స్వాధీనం చేసుకున్నారు. అమృతకు క్రైమ్ వెబ్ సిరీస్‌లపై మక్కువ ఉండేది. ఆమె అకడమిక్ నేపథ్యం, ఈ ఆకర్షణ ఆమెకు "పర్ఫెక్ట్ మర్డర్" ప్లాన్ రూపొందించే ధైర్యం ఇచ్చాయి. కానీ డిజిటల్ ఆధారాలు, ఆమె స్వయంగా ఒప్పుకోవడంతో కేసు సాల్వ్ అయింది. అమృత కుటుంబం ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించింది. హత్యకు చాలా కాలం ముందే ఆమెతో సంబంధాలు తెంచుకున్నామని పేర్కొంది.





















