(Source: ECI/ABP News/ABP Majha)
Maoist Ravi: బాంబు ప్రమాదంలో మావోయిస్టు రవి మృతి... ఏడాదిన్నర తర్వాత ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ
తాను తయారు చేసిన బాంబు పరీక్షిస్తున్న సమయంలో పేలి మావోయిస్టు రవి మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ప్రమాద విషయాన్ని మావోయిస్టు పార్టీ ఇటీవల ధ్రువీకరించింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన జారీ చేసింది. బాంబులు పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మావోయిస్టు రవి మృతి చెందాడని పేర్కొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్ టీంలో రవి కీలక సభ్యుడు. రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత ఆయన మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఝార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టులు తెలిపారు. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి... కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్ట.
బాంబు ప్రమాదంలో రవి మృతి
బాంబు ప్రమాదంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మరణించారు. తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు పేలి రవి మృతి చెందారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రమాదం జరిగింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ రవి మరణాన్ని ఆలస్యంగా ధ్రువీకరించింది. మావోయిస్టు టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉన్న రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. జూన్ 5, 2020న ఝార్ఖండ్‌లో జరిగిన ఓ బాంబు ప్రమాదంలో రవి మృతి చెందాడని, అతడి భౌతిక కాయాన్ని విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు చేశామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.
Also Read: వానలు వెలిశాయి.. వ్యాధులు పొంచి ఉన్నాయి... జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు
నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై 2014 గెరిల్లా జోన్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఝార్ఖండ్‌లో ఈఆర్‌బీ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించాడు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎలక్ర్టిల్స్, ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానం ఉండడంతో మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా మారాడు. బాంబులు పేల్చేందుకు ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో రవి దిట్ట. అదేవిధంగా అత్యాధునిక ఐఈడీలు అమర్చడంలో రవి నిష్ణాతుడు. ప్రజావిముక్తి గెరిల్లా ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చడంలో రవి కీలక పాత్ర పోషించాడు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ రవి మృతిపై కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసింది.
Also Read: 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి