అన్వేషించండి

Muchumarri Minor Case: ముచ్చుమర్రి బాలిక కేసులో ఊహించని పరిణామం - వ్యక్తి అనుమానాస్పద మృతి

Andhrapradesh News: ముచ్చుమర్రి బాలిక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలిక అదృశ్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పీఎస్‌లో మృతి చెందాడు.

Man Suspicious Death In Muchumarri Minor Incident: నంద్యాల (Nandyal) జిల్లా ముచ్చుమర్రిలో (Muchumarri) 8 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నందికొట్కూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ ఈ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌లో మృతి చెందాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా.? లేక మరేదైనా కారణమా.? అనేది తెలియాల్సి ఉంది. మృతదేహంపై గాయాలున్నాయని.. లాకప్ డెత్ అయ్యాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇంకా వీడని మిస్టరీ

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు ఇంకా వెతుకులాట కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్లు ఆడుకుందామని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీంతో బాలిక మృతి చెందగా మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ నెల 7న బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ముగ్గురు మైనర్లను నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం తొలుత ఎత్తిపోతల కాలువలో ఎన్టీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. నిందితులు పూటకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. 

ఈ క్రమంలో నిందితులతో సహా వారి తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను కాపాడేందుకు వారి తల్లిదండ్రులు మృతదేహాన్ని మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్మశానంలో పాతిపెట్టామని నిందితులు చెప్పగా.. అక్కడా పోలీసులు గాలింపు చేపట్టారు. అయినా బాలిక మృతదేహం దొరకలేదు. చివరకు కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేశామని చెప్పగా పోలీసులు వెతుకుతున్నారు.

Also Read: Nara Lokesh: సౌదీ అరేబియాలో మరో తెలుగు వ్యక్తి దీన స్థితి - స్పందించిన మంత్రి లోకేశ్, స్వస్థలానికి తీసుకొస్తామని భరోసా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget