అన్వేషించండి

Hyderabad: విడాకులు ఇచ్చిందని మాజీ భార్యను హత్య చేసిన వ్యక్తి - అది కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చి !

Wife Murder: ఆస్ట్రేలియా నుంచి వచ్చి మాజీ భార్యను హత్య చేశాడో వ్యక్తి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ ఘోరం జరిగింది

Man kills ex wife:  హైదరాబాద్‌ వనస్థలిపురంలో బుధవారం పట్టపగలే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీత దారుణ హత్యకు గురైన ఘటన   కలకలం రేపింది.   పది నెలల క్రితం విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న పగతో మాజీ భర్త మహేశ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అత్యంత కిరాతకంగా సునీత ప్రాణాలు తీయడమే కాకుండా, అడ్డువచ్చిన వారిని చంపేందుకు పెట్రోల్ డబ్బా, కట్టర్‌తో వచ్చి భీభత్సం సృష్టించాడు.

ప్రేమ వివాహం నుంచి విడాకుల వరకు.. 

సునీత, మహేశ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. గతంలో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ ఎన్నారైలుగా స్థిరపడ్డారు. అయితే, అక్కడ వారి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక సునీత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగొచ్చేసింది. పది నెలల క్రితం మహేశ్‌కు అధికారికంగా విడాకులు ఇచ్చి, శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

పక్కా ప్లాన్‌తో  మాజీ భర్త అటాక్..                                      

సునీత రెండో పెళ్లిని మహేశ్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను అంతమొందించాలనే పగతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మహేశ్, బుధవారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని శ్రీనాథ్ సొంత ఫ్లాట్‌కు చేరుకున్నాడు. నిందితుడు మహేశ్ రాక మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. తనతో పాటు రెండు పదునైన కత్తులు, కట్టర్ , పెట్రోల్ డబ్బాను వెంట తెచ్చుకున్నాడు. లోపలికి ప్రవేశించిన వెంటనే సునీతపై కిరాతకంగా దాడి చేశాడు. సునీత నాలుగు నెలల గర్భిణి. ఆమె గర్భిణీ అని కూడా చూడకుండా కత్తులతో తలపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి చంపేశాడు. ప్రస్తుతం సునీత నాలుగు నెలల గర్భిణీ. మరో ప్రాణం తనలో పెరుగుతున్న వేళ, పాత కక్షలతో మాజీ భర్త ఆమె ఊపిరి తీశాడు. అరుపులు విని లోపలికి రావడానికి ప్రయత్నించిన ఇరుగుపొరుగు వారిని కూడా మహేశ్ బెదిరించాడు. ఎవరైనా లోపలికి వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని హెచ్చరించాడు. రక్తపు మడుగులో సునీత పడిపోయిన తర్వాతే అక్కడి నుంచి బయటకు వచ్చాడు.

పోలీసుల దర్యాప్తు                                                             

విషయం తెలుసుకున్న సునీత భర్త శ్రీనాథ్ కన్నీరుమున్నీరుగా ఇంటికి చేరుకున్నాడు. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడు మహేశ్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానిక గ్రీన్‌సిటీ కాలనీ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.   

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget