అన్వేషించండి

Andhra Pradesh Crime News: కుమార్తెకు బర్త్‌డే కేక్ కొనడానికి డబ్బుల్లేవని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య- అన్నమయ్య జిల్లాలో విషాదం

Andhra Pradesh Crime News: ఆర్థిక ఇబ్బందులు ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసింది. కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పుట్టిన రోజు కేక్ తేస్తాడని ఎదురు చూసిన ఆ చిన్నారికి తండ్రి చావు కబురు వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra Pradesh Crime News: ఒక పక్క నాలుగేళ్ల చిన్నారి పుట్టిన రోజు వేడుకలు, సాయంత్రం నాన్న వచ్చేటప్పుడు కేక్ తెస్తాడని ఆ బిడ్డ వెయ్యి కళ్లతో నిరీక్షణ. కానీ ఆ ఇంటికి చేరింది కేక్ కాదు. విగత జీవిగా మారిన తండ్రి భౌతిక కాయం. అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో చోటు చేసుకున్న ఈ  హృదయవిదారక ఉదంతం స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న ఒక సచివాలయ ఉద్యోగి, తన ఇద్దరు ఆడపిల్లలను,భార్యను అనాథలను చేస్తూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఏం జరిగింది? 

రామసముద్రానికి చెందిన 36 ఏళ్ల బి. సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. గతేడాది జులైలో బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని తాకాటంవారిపల్లె సచివాలయానికి ఆయన బదిలీ అయ్యారు. భార్య సౌమ్య, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, హైందవితో కలిసి బైపాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్నారు. 

ఆదివారం సెలవు దినం కావడంతో సుబ్రమణ్యం తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని నాగిరెడ్డి పల్లెలో ఉన్న అత్తవారింటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తన పెద్ద కుమార్తె ఐశ్వర్య నాలుగో పుట్టిన రోజు. ఆఫీసుకు వెళ్లి సాయంత్రం, వచ్చేటప్పుడు నీ పుట్టిన రోజుకు కేక్ తీసుకొస్తాను అని ఆ చిన్నారికి ముద్దుగా చెప్పి ఉదయం 7 గంటలకు నాగిరెడ్డి పల్లె నుంచి బి. కొత్తకోటకు బయల్దేరారు. ఆ మాటలు తన బిడ్డతో ఆయన చెప్పిన చివరి మాటలని అప్పుడు ఎవరూ ఊహించలేదు. 

వేధించిన ఆర్థిక ఇబ్బందులు 

ఇంటికి చేరుకున్న తర్వాత, ఉదయం 7.50 గంటల సమయంలో రామసముద్రంలో ఉన్న తల్లి నీలమ్మతో సుబ్రమణ్యం ఫోన్‌లో మాట్లాడారు. ఆ మాటల్లో ఆయన గొంతులో ఏదో తెలియని భారం ఉంది. ఈ రోజు బిడ్డ పుట్టినరోజు కేక్‌ తీసుకోవాలి, కానీ చేతిలో పైసా లేదు, ఆర్థిక ఇబ్బందులు బాగా వేధిస్తున్నాయి. అంటూ తల్లి దగ్గర తన బాధను పంచుకున్నాడు. 

కొడుకు మాటల్లో ఆందోళన గమనించిన నీలమ్మ వెంటనే కోడలు సౌమ్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆందోళనతో కుటుంబ సభ్యులు 8 గంటల నుంచి ఆయనకు వరుసగా కాల్స్ చేసినా, సుబ్రమణ్యం కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే ఆయన తన మనసులో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. 

ఆఖరి సందేశం 

ఆత్మహత్యకు ముందు సుబ్రమణ్యం తన భార్య ఫోన్ నెంబర్‌కు ఒక మెసేజ్ టైప్ చేశాడు. " నీకు నీ బిడ్డలకు నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను... నన్ను క్షమించండి.." అని రాశాడు. అయితే మెసేజ్ పంపే ధైర్యం సరిపోలేదో, ఏమో కానీ, అది సెండ్‌ చేయకుండానే ఫోన్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత ఉదయం 8 నుంచి 9.15 గంటల మధ్య తన నివాసంలోని శ్లాబ్ కొక్కికి చీరతో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచాడు. 

రోడ్డున పడ్డ కుటుంబం 

చాలాసేపటి వరకు సుబ్రమణ్యం బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు, ఇంటి యజమాని కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే ఆయన మరణించి ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

Frequently Asked Questions

అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న హృదయవిదారక సంఘటన ఏమిటి?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన భార్య, ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి ఎవరు, ఆయన ఎక్కడ పని చేస్తున్నారు?

ఆయన పేరు బి. సుబ్రమణ్యం, వయస్సు 36 ఏళ్లు. ఆయన బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని తాకాటంవారిపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?

ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ, డబ్బు లేదని, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయని తన బాధను పంచుకున్నారు.

సుబ్రమణ్యం తన కుటుంబానికి ఏమి సందేశం ఇచ్చాడు?

ఆత్మహత్యకు ముందు, ఆయన తన భార్యకు ఒక మెసేజ్ టైప్ చేశాడు. 'నీకు నీ బిడ్డలకు నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను... నన్ను క్షమించండి..' అని అందులో రాశాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
Multi million dollar Scam in US: అమెరికాలో 400 ఏళ్ల జైలు శిక్షకు గురికాబోతున్న భారతీయ బ్రదర్స్ - వీళ్లు చేసిన నేరం అలాంటిదే మరి ! Indian rigin brothers in multi million dollar Scam in US could face 400 years in prison
అమెరికాలో 400 ఏళ్ల జైలు శిక్షకు గురికాబోతున్న భారతీయ బ్రదర్స్ - వీళ్లు చేసిన నేరం అలాంటిదే మరి !
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Nizamabad Road Accident: నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
నిజామాబాద్‌ జిల్లాలో NH 44పై ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురి మృతి
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget