Rajasthan Crime: కట్నం తేలేదని భార్యను గ్యాంగ్ రేప్ చేయించిన భర్త - వీడియో తీసి బెదిరింపు !
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ భర్త తన భార్య కట్నం తేలదేని బంధువులతో గ్యాంగ్ రేప్ చేయించాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
రూ. లక్షన్నర కట్నం ఇవ్వలేదని బంధువుల్లో కొంత మందిని పిలిచి భార్యను గ్యాంగ్ రేప్ చేయించాడు. అంతే కాదు దాన్ని వీడియో తీయించాడు. అంతటితో ఆగితే కామాంధుడు.. కట్నపిశాచి అని చెప్పుకునేాళ్లం. అంతటితో ఆగలేదు. ఆ వీడియోను తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు అతన్ని ఏమని పిలవాలి..? ఇంత నికృష్ణానికి పాల్పడేవాళ్లుంటారని.. ప్రపంచంలో అరుదుగా బయటపడుతూ ఉంటుంది. అందుకే ఈ క్రూరత్వానికి మాటలు కూడా తక్కువే ఉంటాయి. ఇలాంటి వ్యక్తి రాజస్థాన్లో ఉన్నాడు.
అనకాపల్లి జిల్లాలో సినీఫక్కీలో చోరీ, తుపాకీతో బెదిరించి పట్టపగలే బ్యాంకులో దొంగతనం
రాజస్థాన్‌లోని భరత్ పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ ఏడ్చుకుంటూ వచ్చింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదును చూసి పోలీసులకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన భర్త ఇద్దరు సన్నిహిత బంధువుల్ని తీసుకొచ్చి తనపై అత్యాచారం చేయించాడని.. దాన్ని వీడియో కూడా తీశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో తమకు పెళ్లయిందని అప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తున్నారని ఆ మహిళ తెలిపింది. ఇవ్వాల్సిన కట్నంలో ఇంకా రూ. లక్షన్నర మాత్రమే బాకీ ఉందని.. ఆ మెత్తం తీసుకు రావాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన తర్వాత వీడియో తీసి.. ఇంటికి వెళ్లి కట్నం తీసుకు రాకపోతే.. వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తామని బెదిరించినట్లుగా ఫిర్యాదు చేసింది. అయితే కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఇంట్లో వాళ్లు కట్నం డబ్బుల్ని సర్దలేకపోయారు. దీంతో తన భర్త ఆ వీడియోనూ యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారని ఆ మహిళ రోదిస్తోంది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భర్తతో పాటు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బంధువుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్‌లోకి అప్ లోడ్ చేసినట్లుగా భావిస్తున్న వీడియోను డిలీట్ చేయిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఒంటరిగా మహిళ కనిపించే సరికి రాబందులైన ఆటోడ్రైవర్లు - మేడ్చల్ జిల్లాలో గ్యాంగ్ రేప్ !
రాజస్తాన్‌లో కట్నం వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు కూడా ఎక్కువే . ప్రభుత్వాలు ఎంత చైతన్యవంతుల్ని చేయాలని ప్రయత్నం చేసినా... అవన్నీ నిష్ప్రయోజనంగానే మిగులుతున్నాయి.