అన్వేషించండి

East Godavari: పండుగ పూట విషాదం, బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరి మృతి

AP Crime News | తూర్పు గోదావరి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడటంతో భారీ పేలుడు సంభవించడంతో విషాదం నెలకొంది.

Lightning strike at a firecracker manufacturing plant In East Godavari | ఉండ్రాజవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు పడటంతో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 

పిడుగుపాటుకు బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు

సూర్యారావుపాలెం గ్రామ శివారులో బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో కొందరు కార్మికులు దీపావళి పండుగ కోసం టపాసులు తయారు చేసే పనిలో నిమగ్నపై ఉన్నారు. ఇంతలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగుపడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అసలే పిడుగు ప్రభావం, మరోవైపు బాణసంచా తయారీ కేంద్రం కావడంతో పేలుడు ప్రభావం అధికంగా ఉంది. ఈ దుర్ఘటనలో బాణసంచా కేంద్రం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరికొందరు మహిళలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మరో 10 మంది వరకు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ పూట పిడుగు పడి ఇద్దరు మహిళలు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తీవ్రగాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలను విజ్ఞప్తి
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత,  మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన వారికి తక్షణమే మైరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Also Read: Andhra Pradesh Crime News: ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో టోకరా- బ్యాంకులో ఉన్నదంతా ఇచ్చేసిన రైల్వే ఉద్యోగి  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget