News
News
X

Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం

Car accident in Krishna District: నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైంది. అయిదుగురు గాయపడ్డారు. అందులో వరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

FOLLOW US: 

Car accident in Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. అందులో వరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

అప్పటివరకూ ఎంతో సంతోషంగా ఇరుకుటుంబాలు.. 
ఆ వివరాలిలా ఉన్నాయి.. అత్తిలిలో ఓ వివాహం ఘనంగా జరిగింది. పెద్దల సమక్షంలో వారి ఆశీర్వాదంతో ఓ యువతి, యువకుడు పెళ్లిపీటలు ఎక్కారు. అత్తిలిలో వివాహం చేసుకొని వధూవరులు మరికొందరు బంధువులతో వరుడు నివాసానికి హైదరాబాదుకు బయలుదేరారు. వివాహ వేడుక జరగడంతో రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. కానీ బంధువులతో కలిసి వధూవరులు ప్రయాణిస్తున్న కారు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ న్ ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వధూవరులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది (Car Damaged In Road Accident) . ఈ ఘటనలో పెళ్లి బృందం కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. 

అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి ఐదుగురిని తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిని గాయత్రి (26), రేణుక(23), శివ శంకర్ (25), సీతారావమ్మ(47), శరత్(27) లుగా గుర్తించారు. అత్తిలిలో వధువు ఇంటి వద్ద వివాహం చేసుకొని హైదరాబాదు వెళుతుండగా ఘటన జరిగినట్లు స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. రాత్రి వివాహం జరగగా, హైదరాబాద్‌లోని వరుడి నివాసానికి కారులో బయలుదేరగా మార్గం మధ్యలో కారు కల్వర్టును ఢీకొట్టడంతో రెండు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

వరుడి పరిస్థితి విషమం..!
కార్ డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వరుడు శివశంకర్, వధువు రేణుక, వరుడి తల్లి సీతారావమ్మ, గాయత్రి, మరొకరు గాయపడ్డారు. వారిలో వరుడు కె శివశంకర్ పరిస్థితి విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డ ప్రమాదం విషయంలో ఏ నిర్లక్ష్యం కనిపించడం లేదు. వాహనం నడుపుతున్న కారు డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని మిగతా వారు గమనించేలోగా వాహనం డివైడర్ ను వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగేలా కనిపిస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గాయపడ్డ వారి వివరాలు..
1)కె శివశంకర్ s/o శ్రీనివాసరావు, A/30,, హైదరాబాద్
పెళ్లి కొడుకు
2) కె రేణుక, A/23
పెళ్లి కూతురు
3) కె సీతారావమ్మ A/50
వరుడి తల్లి
4) జీ.గాయత్రి,A/35  
5) కె సుమంత్, A,/31 డ్రైవర్

Also Read: Drugs Seized At Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, అక్కడ తొలిసారిగా ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత

Published at : 13 Aug 2022 12:05 PM (IST) Tags: Road Accident Crime News car Bride Bridegroom Injured

సంబంధిత కథనాలు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Cannabis Seized In Hyderabad: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, 98 కిలోల గంజాయి స్వాధీనం

Cannabis Seized In Hyderabad: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, 98 కిలోల గంజాయి స్వాధీనం

Hyderabad Crime: లేపేస్తామని బెదిరిస్తే, ఏకంగా రౌడీ షీటర్‌ను చంపేశాడు! మరో ట్విస్ట్ ఏంటంటే

Hyderabad Crime: లేపేస్తామని బెదిరిస్తే, ఏకంగా రౌడీ షీటర్‌ను చంపేశాడు! మరో ట్విస్ట్ ఏంటంటే

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Telangana Maoists: పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం, అగ్రనేత సంచారంపై అలజడి

Telangana Maoists: పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం, అగ్రనేత సంచారంపై అలజడి

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?