అన్వేషించండి

Krishna News : మొదటి భార్యపై గొడ్డలితో దాడి, రెండో భార్య గొంతు కోసి, ఆత్మహత్య చేసుకున్న భర్త

Krishna News : కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామంలో భార్యపై కత్తితో దాడి గొంతు కోశాడో వ్యక్తి. దాడి అనంతరం పరారైన నిందితుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Krishna News : భార్యపై కత్తితో దాడి చేసి పరారీలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం భార్యపై దాడి చేశాడు. పుల్లయ్య తన రెండో భార్య రమ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమ్య స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యపై దాడి అనంతరం పుల్లయ్య  పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న పుల్లయ్య శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. 

మామిడి తోటలో ఆత్మహత్య 

స్థానికంగా ఉన్న మామిడి తోటలో పుల్లయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పుల్లయ్య తన మొదటి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

యువకుడి హత్య

తిరుపతి సమీపంలోని మంగళం బిటిఆర్ కాలనీకి చేందిన కన్నయ్య అదే ప్రాంతానికి చేందిన ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి ఇంట్లో విషయం తెలుసుకున్న పెద్దలు అమ్మాయిని మందలించి, తమ కుమార్తె జోలికి రావద్దని కన్నయ్యకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే ఎలాగైన తాను‌ ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకోవాలని భావించిన కన్నయ్య యువతిని ఈ నెల 15 తారీఖున పెళ్ళి చేసుకునేందుకు తీసుకెళ్ళాడు. అయితే  ప్రేమికులను పట్టుకున్న పూతలపట్టు పోలీసులు గుర్తించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురు తల్లిదండ్రులకు పిలిచి పంపారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసింది. 

శుక్రవారం రాత్రి  రాత్రి కన్నయ్య తన స్నేహితులైన చందు,ప్రవీణ్ లతో కలిసి తిరుమలనగర్ కు వెళ్ళే మార్గంలో ఉన్న చికెన్ దుకాణం వద్దకు వచ్చారు.  అదే సమయానికి అక్కడకు  యువతి‌ బావ కిరణ్, అతని స్నేహితులు గిరి,మహేష్, లక్ష్మీ నారాయణ రాజులు వచ్చారు.  మళ్లీ యువతిని తీసుకెళ్లడానికి వచ్చారేమో అనుకున్న వారు కన్నయ్యతో గొడవ పడ్డారు. గ్యాంగ్ వార్‌లాగా కొట్టుకునే ప్రయత్నంలో తమకు అందుబాటులో ఉన్న ఎగ్ ట్రేలతో దాడి చేసుకున్నారు. అప్పటి వరకూ మనకెందుకుకే అని ఓపిక పట్టి చూస్తున్న చికెన్ షాప్ యజమాని సతీష్.. పక్కకెళ్లి కొట్టుకోండని అరిచాడు. అలా అన్నందుకు యువతి తరపు బంధువుల్లో ఒకరైన లక్ష్మినారాయణ రాజు   చికెన్ కొట్టే కత్తితో యజమానిపై దాడి చేసేందుకు  ప్రయత్నించాడు. దీంతో చికెన్ కొట్టు యజమాని తన ప్రాణం కాపాడుకునందుకు  లక్ష్మీ నారాయణ రాజు చేతిలోని కత్తిన తీసుకుని లక్ష్మీ నారాయణ రాజు మెడపై నరికాడు. లక్ష్మినారాయణ రాజు స్పాట్‌లోనే చనిపోయాడు.  స్ధానికుల సమాచారం మేరకు ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ ను అదుపులోకి తీసుకుని, గొడవ పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Viral News: టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget