By: Harish | Updated at : 17 Dec 2022 07:13 PM (IST)
మహిళా ఉద్యోగితో హాస్టల్లోనే ప్రిన్సిపాల్ రాసలీలలు
Principal romance with Contract Employee: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్కూల్ హాస్టల్ లో ప్రిన్సిపల్ మహిళా ఉద్యోగినితో ఎఫైర్ కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్దులు మహిళా ఉద్యోగినితో ప్రిన్సిపల్ రాసలీలలను సెల్ ఫోన్ లో వీడియో తీశారు. విషయం తెలియడంతో.. వీడియో తీసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదడంతో విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. స్కూల్లో రాసలీలలు నడిపిన ప్రిన్సిపాల్‌పై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాల హాస్టల్‌లో రాసలీలలు..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ ఉర్దూ పాఠశాల హాస్టల్ లో రాత్రి సమయంలో జరుగుతున్న రాసలీలలను విద్యార్దులు వెలుగులోకి తీసుకురావటం సంచలనంగా మారింది. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్ ప్రసాద్, కంట్రాక్ట్ యుడిసి మహిళా ఉద్యోగినితో రాసలీలలు సాగిస్తున్నారు. దీంతో విద్యార్దులు వీరు ఏకాంతంగా గడుపుతున్న వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. హాస్టల్లో యుడిసి ఉద్యోగినితో ఏకాంతంగా గడుపుతుండగా విద్యార్థులు వీడియో చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని కోపంతో ఊగిపోయి విద్యార్థులను చితకబాదాడు. ప్రిన్సిపాల్ ఆనంద ప్రసాద్, కంట్రాక్ట్ ఉద్యోగినితో కొన్ని నెలలుగా రాసలీలలు సాగిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో కలకలం....
విద్యార్దులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన పాఠశాల ప్రిన్సిపాల్ తన కింద పనిచేసే మహిళా ఉద్యోగినితో రాత్రివేళ రాసలీలలు సాగిస్తున్నారు. విద్యార్దులు అంతా చూస్తుండగానే వీరిద్దరూ కలిసి గదిలోకి వెళ్లారు. అనంతరం వీరు లైట్లు కూడా తీయకుండా రొమాన్స్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన విద్యార్థులు.. ఈ తతంగాన్ని తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. తన విధులు సరిగా నిర్వహించకుండా, ప్రిన్సిపాల్ ఇలా రాత్రిపూట హాస్టల్ కు రావటం, వార్డెన్ లేకపోవడంతో ఇష్టరీతిగా ప్రవర్తించారని విద్యార్థులు తెలిపారు. తనకు ఏ అడ్డు లేదన్నుట్లుగా హాస్టల్‌లోనే కాంట్రాక్ట్ ఉద్యోగినితో ఏకాంతంగా గడుపుతూ సంబంధం కొనసాగించేవారు. విద్యార్దుల ముందు ప్రిన్సిపాల్, మహిళా ఉద్యోగిని అసభ్యకరంగా ప్రవర్తించడంపై వారి తల్లిదండ్రులతో పాటు బయట నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి.
సాయంత్రం విద్యార్దులు స్కూలు నుంచి వచ్చిన తరవాత హాస్టలో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆపై స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేసుకుని, ఆ తరువాత భోజనం చేసి నిద్రిస్తుంటారు. అయితే విద్యార్దులు ఉండే గదిని ప్రిన్సిపాల్ తన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. చీకటి పడగానే ప్రిన్సిపాల్ కోసం ఉద్యోగిని రెడీ అయ్యి హాస్టల్ కు రావటం, అక్కడ వారిద్దరు రాసలీలు సాగించటం విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. తమకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే తప్పుదోవ పట్టారని, ఆయనకు గుణపాఠం చెప్పాలని విద్యార్థులు భావించారు. సెల్ ఫోన్ సేకరించిన విద్యార్థులు.. ఉద్యోగినితో ప్రిన్సిపాల్ రొమాన్స్ చేస్తూ, ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను విద్యార్దులు తమ స్నేహితులకు షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ వీడియోలు తీసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆనంద్ ప్రసాద్ చితకబాదాడు. విద్యార్దులకు గాయాలు కావటం, ఆపై తల్లిదండ్రులు దీనిపై ఆరా తీయటంతో జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
విద్యాశాఖ అధికారుల విచారణ..
విద్యార్థులు విడియోలు తీయటం సంచలనంగా మారటంతో, అందులోనూ రాసలీలలకు సంబందించిన వీడియోలు బయటకు షేర్ కావటంతో విద్యా శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనపై అటు విద్యా శాఖ అధికారులు, ఇటు పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై విద్యాశాఖ జాగ్రత్తగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. విద్యార్దులు మైనర్లు కావటంతో ఎలా డీల్ చేయాలనే విషయాలపై పోలీసలు పరిశీలిస్తున్నారు.
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!
Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన