![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Konaseema News : ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు విద్యుదాఘాతం, మూడో తరగతి విద్యార్థి మృతి
Konaseema News : కోనసీమ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఐదుగురు విద్యార్థులకు స్కూల్ ఆవరణలో విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు.
![Konaseema News : ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు విద్యుదాఘాతం, మూడో తరగతి విద్యార్థి మృతి Konaseema Dontikurru high school students electrocuted third class student died DNN Konaseema News : ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు విద్యుదాఘాతం, మూడో తరగతి విద్యార్థి మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/28/fee7b964e330581aa29c440265f024a51666956233930235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Konaseema News : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. ఒక విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్కూల్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ ఐరన్ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తలిదండ్రులు ఆరోపిస్తు్న్నారు. కాట్రేనికోన మండలం దొంతికుర్రు హైస్కూల్ కి చెందిన ఐదుగురు విద్యార్థులకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హైస్కూలు సమీపంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవన నిర్మాణం కోసం ఐరన్ పనుల కోసం స్కూల్ నుంచి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. ఈ కనెక్షన్ తొలగించకపోవడంతో విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండుగా ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.
సచివాలయ పనుల్లో నిర్లక్ష్యం
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరెంటు షాక్ తో 5 విద్యార్థులకు గాయాలయ్యాయి. ముగ్గురు క్షేమంగా ఉండగా ఒకరు మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానిక ఎస్ఐ టి.శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ స్లాబ్ కోసం ఐరన్ కట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన విద్యార్థులు
- యాడ్ల నవీన్-3వ తరగతి
- చిట్టిమేను వివేక్- 3వ తరగతి
- తిరుపతి సతీష్ కుమార్-4వ తరగతి
- బొంతు మహీధర్-4 వ తరగతి
- మొల్లేటి నిఖిల్-3వ తరగతి
అసలేం జరిగింది?
కాట్రేనికోన మండలం జడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ ఘాతానికి గురై ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యడ్ల నవీన్ అనే మూడో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలోని సచివాలయ నిర్మాణం కోసం స్లాబ్ పనులు జరుగుతుండగా ఐరన్ పనుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గురై విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి స్థానిక ఎస్సై టి శ్రీనివాస్ పరిశీలించారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో అమలాపురంలోని కిమ్స్ హాస్పటల్ తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే ఒక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా మిగిలిన ముగ్గురు విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులు సంబంధించి పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలి ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)