Robbery Case: ఇల్లును గుల్ల చేసిన దొంగను పట్టించిన దోమ, అచ్చం సినిమా సీన్ రిపీట్ ?
Robbery Case: ఇల్లును గుల్ల చేసి ఫుల్లుగా తినేసి వెళ్లాడో నేరస్థుడు. అతడిని పట్టుకోవడం ఎవరి తరమూ కాలేదు. సీసీ కెమెరాల కంట కూడా ఇతను పడలేదు. కానీ ఓ దోమ ఇతగాడిని పోలీసులకు పట్టించంది. ఎక్కడంటే..?
Robbery Case: అర్ధరాత్రి అంతా నిద్రిస్తున్నారు. ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ముందుగా రెక్కీ నిర్వహించి మరీ అపార్ట్ మెంట్ లోకి చొరబడ్డాడు. ఇంటి మొత్తాన్ని దోచేసి అలిసిపోయాడు. అంతే వంట గదిలోకి వెళ్లి తనేందుకు ఏమైనా దొరుకుతాయోమోనని చూశాడు. మంచి విందు భోజనం కనిపించేసరికి ఫుల్లుగా కుమ్మేశాడు. ఇక పని అయిపోయింది కదా అని బయట పడ్డాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ వాళ్లు ఎంత ప్రయత్నించినా నిందితుడిని పట్టుకోలేకపోయారు. చివరకు దోమ సాయంతో దొంగను పట్టుకున్నారు.
రెక్కీ నిర్వహించి మరీ దొంగతనం..!
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్సులోని ఓ కుటుంబం ఊరెళ్లింది. విషయం గుర్తించిన ఓ దొంగ... ఈ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. రెక్కీ నిర్వహించి మరీ దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశాడు. ఉన్నవన్నీ దోచేసి ఉడాయించాడు. అయితే చోరీ జరిగిన తెల్లారి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించేందు కోసం డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు. కానీ దొంగకు చాలా ఎక్స్ పీరియన్స్ ఉండటంతో వీళ్లు అతడిని పట్టుకోలేకపోయారు. అయితే ఇల్లంతా గుల్ల చేసిన ఆ దొంగ అలిసిపోయి ఫుల్లుగా ఫుడ్ కుమ్మేశాడు. అయితే ఇల్లాంతా వెతికిన పోలీసులకు వంటగదిలో దొంగ తిని వదిలేసిన నూడుల్స్, కోడి గుడ్ల పొట్టు.. గెలికేసిన వంట సామాన్లు తప్ప.. ఇంకేవీ కనిపించలేదు.
తనను కుట్టిన దోమను చంపిన దొంగ..
వార్డ్ బోర్ లో సర్దేసిన దుప్పట్లు, బట్టలు, దిండ్లు మంచంపై చిందరవందరగా పడేసి ఉన్నాయి. దోమలు కుట్టాయో ఏమో ఓ మస్కిటో కాయిల్ కూడా వెలిగించాడు. ఈ సీన్స్ చూసిన తర్వాత దొంగ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడనే విషయాన్ని గుర్తించారు పోలీసులు. అంతే అప్పుడు వీరికి ఓ చనిపోయిన దోమ కనిపించింది. దాని ద్వారానే విచారణ సాగించాలనుకున్నారు పోలీసులు. దొంగను కుట్టి అతడి రక్తాన్ని ఫుల్లుగా పీల్చేసింది. కోపంతో అతడు ఆ దోమను చంపగా... తెల్లటి గోడపై ఎర్రటి రక్తంతో అతుక్కుపోయింది. అయితే అదే అతను చేసిన తప్పు అయింది. దోమను చంపడం అంత పెద్ద విషయం అని అతనికి అప్పుడు తెలియదు. పోలీసులు వెంటనే క్లూస్ టీం ఆధారంగా రంగంలోకి దింపారు.
దోమలోని బ్లడ్ శాంపిల్ సేకరించిన పోలీసులు
జాగ్రత్తగా ఆ గోడమీది బ్లడ్ శాంపిల్ ను తీసుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 9 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. పోలీసులు తమ వద్ద ఉన్న క్రిమినల్స్ రికార్డులు ఓపెన్ చేసి వాటితో పోల్చి చూశారు. ఒక్కడితో సరిగ్గా సరిపోతున్నాయి. అతగాడు నేరాల్లో ఆరితేరడంతో.. పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే తమ స్టైల్ లో ఈ దొంగతనం నువ్వే చేశావా అని ప్రశ్నించడంతో... నేను కాదంటూ బుకాయించాడు. ఎక్కడ చోరీ జరిగినా నేనేనా దొంగతనం చేసిందంటూ పోలీసుల మీదకే ఫైర్ అయ్యాడు. నిందితుడి ఓవర్ యాక్షన్ చూసి ల్యాబ్ రిపోర్టులు ముందు పెట్టాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.