అన్వేషించండి

Khammam Suicide Video: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో

ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు తనను వేధింస్తున్నారంటూ ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. కానీ అసలు సంగతి వేరే ఉందంటున్నారు పోలీసులు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు తనను పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు డబ్బాతో తీసిన వీడియో వైరల్ అవుతోంది. అడవితో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని ఓ యువకుడు వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.  చిన్న గొడవకు సంబంధించి తనను సత్తుపల్లి సీఐ రమాకాంత్, కానిస్టేబుళ్లు రాజకీయ నాయకులతో కలిసి వేధిస్తున్నారని అతడు వీడియో ఆరోపణలు చేశాడు. మూడు రోజుల నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తిప్పించి రోజూ తిడుతున్నారని ఆరోపించాడు. తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని వారి వేధింపులు భరించలేక చచ్చిపోవడమే మంచిదనుకుంటున్నా అని వీడియో పెట్టాడు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామానికి చెందిన తాటి జంపన్న అనే యువకుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి

బస్సులో ఘర్షణ

అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన థర్మసోత్‌ భాను, తాటి జంపన్న బస్సులో ఐదు రోజుల క్రితం ఘర్షణ పడ్డారు. రెండు రోజుల క్రితం యాతాలకుంటలో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఎంతకూ రాజీ కుదరకపోవడంతో విద్యార్థి భాను తండ్రి థర్మసోతు నర్సింహారావు కొడుకుతో కలిసి సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తాటి జంపన్నపై ఫిర్యాదు చేశారు. మూడు రోజుల నుంచి జంపన్నను విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. శుక్రవారం జంపన్న కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వచ్చి పోలీసులను ప్రాథేయపడటంతో రాత్రికి ఇంటికి పంపించారు. తిరిగి ఠాణాకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జంపన్న శనివారం ఉదయం చెరుకుపల్లి తోగు వద్ద నుంచి అడవిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు.

Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..

అడవిలో గాలింపు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో గ్రామస్తులు, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అప్రమత్తమై జంపన్న సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేసి, సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వియషమై సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్‌ను వివరణ కోరగా, జంపన్ననను స్టేషన్‌లో విచారించామని, కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించామని తెలిపారు. సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం జంపన్నను తరలించామని చెప్పారు.

Also Read: ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Road Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget