News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Houses : ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..

ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారిని, లబ్దిదారుల వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారు. రూ. పది, ఇరవై వేలు కడితే యాజమాన్య హక్కుతో పట్టా ఇప్పిస్తామంటున్నారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో రూ.  పది, ఇరవై వేలకే ఇంటి పట్టాను ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ పట్టాలు మాత్రమే ఇస్తారు. ఇళ్లు కాదు. అంటే.. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నవారు లేదా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని కట్టుకున్న వారు మాత్రమే అర్హులు. అంటే ఇప్పటికే ప్రభుత్వ ఇచ్చిన ఇళ్ల లబ్దిదారులు లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్న వారు మాత్రమే అర్హులు. వారందరూ తమ తమ సొంత ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ వారి పేరు మీద ఇంటి పట్టాలుండవు. యాజమాన్య హక్కులు లేవు. ఇలాంటి వారందరికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. పది, ఇరవై వేలతోనే పని పూర్తి చేయాలని నిర్ణయించింది. 

Also Read : వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత... ఏపీ సంక్షోభాన్ని చైనా, యూరప్ లతో పోల్చడమేంటన్న పయ్యావుల

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు అదే పనిలో ఉన్నారు.  ప్రస్తుతం వాలంటీర్లు  సర్వేలో బిజీగా ఉన్నారు.  గ్రామాల్లో తిరిగి ఇళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు ఉంటున్నాయి.   మీరు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో ఇల్లు కట్టుకున్నారా..? కట్టుకుని ఉంటే.. మీ పేరున పట్టా లేకపోతే రూ. 20,000 కడితే వెంటనే పట్టా వస్తుంది అని చెబుతున్నారు.   ఒకవేళ మీరు పోరంబోకు, గ్రామ కంఠం భూమిలో ఇల్లు కట్టుకుని ఉన్నా రూ. 10,000 కడితే పట్టా ఇప్పిస్తామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఎవరి వద్ద అయినా కొనుక్కున్నా పర్వాలేదు రూ.20,000 కట్టండి మీ పేరున పట్టా ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు.  వివరాలు సేకరిస్తూ ఇంటి పన్ను రసీదులు కూడా తీసుకుంటున్నారు. 

Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్ 

ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని కేబినెట్‌లో ఆమోదించింది.  హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చు. అయితే రుణం బాగా తక్కువ తీసుకున్న వారికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  పేదలకు 1983 నుంచి ఏపీలో హౌసింగ్ కార్పొరేషన్ పేరు మీద ఇళ్లు ఇస్తున్నారు.  సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఆ సగం సొమ్మును లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి. 

Also Read: విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?

అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్  అడగడం మానేశాయి. దాంతో ఆ లోన్లు అలాగే ఉండిపోయాయి. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు లోన్ పూర్తి కాకపోవడం వల్ల వారిపైకి మారలేదు. అందుకే సీఎం జగన్ వారికి వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించి  వారి వద్ద నుంచి రూ. పది, ఇరవై వైలు వసూలు చేసి రుణవిముక్తుల్ని చేయాలని నిర్ణయించారు.  ఇందు కోసం వాలంటీర్లు వివరాలు సేకరిస్తున్నారు. 

Also Read: విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Oct 2021 04:36 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Volunteers One Time Settlement Scheme Rs. Ownership document for ten thousand

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Chandrababu Arrest: ఇలాంటి అరెస్ట్ ఎన్నడూ చూడలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు

Chandrababu Arrest: ఇలాంటి అరెస్ట్ ఎన్నడూ చూడలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు

Chandrababu Naidu Arrest: ఆయనకు ఒక గుణపాఠం, చంద్రబాబు అరెస్ట్‌పై హీరో సుమన్ స్ట్రాంగ్ రియాక్షన్

Chandrababu Naidu Arrest: ఆయనకు ఒక గుణపాఠం, చంద్రబాబు అరెస్ట్‌పై హీరో సుమన్ స్ట్రాంగ్ రియాక్షన్

Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు

Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు

Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి

టాప్ స్టోరీస్

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్