By: ABP Desam | Updated at : 09 Oct 2021 03:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీడీపీ నేత పయ్యావుల కేశవ్(ఫైల్ ఫొటో)
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేనితనమే కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధానికి లేఖ రాశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తప్పయితే, వైసీపీ ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న హిందూజా సంస్థను మూతపడేలా చేసిన ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి అధిక ధరకు విద్యుత్ ఎందుకు కొనుగోలుచేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసిందని ఆరోపించారు.
అధికార యంత్రాంగ వైఫల్యం
రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్న ఈ సమయంలోనే లోడ్ రిలీఫ్ ల పేరుతో విద్యుత్ కోతలకు కారణం ముమ్మాటికీ అధికార యంత్రాంగమేనని పయ్యావుల అన్నారు. ఆర్థిక రంగాన్ని ఏ విధంగా అయితే దెబ్బతీశారో, విద్యుత్ రంగాన్ని కూడా కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతల్లో అధికారుల పాత్ర ప్రధానంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై తప్పుడు సమాచారమిచ్చింది అధికార యంత్రాంగమేనని ఆరోపించారు. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కూడా అసత్యాలే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని, ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటిని పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాశారన్నారు. ప్రభుత్వ ముందుచూపులేనితనానికి ప్రధాని ఎలా స్పందిస్తారన్నారు. మిగులు విద్యుత్ లో ఉన్న రాష్ట్రం ఈ విధమైన స్థితికి రావడానికి వైసీపీ ప్రభుత్వ చర్యలే కారణమన్నారు.
Also Read: విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?
రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం
సీమ థర్మల్ పవర్ స్టేషన్ ను 50 శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వం నిర్వహిస్తోందని పయ్యావుల ఆరోపించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పయ్యావుల అన్నారు.రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి కూడా ఎప్పటి నుంచో జరుగుతుందన్న ఆయన.. కానీ దాన్ని కూడా ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. పవర్ ఎక్సేంజ్ ల నుంచి విద్యుత్ కొనడానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ ను కొనకుండా బయటి రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొంటున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖలో 8 వేల మెగావాట్ల పవన విద్యుత్ తమ వద్ద సిద్ధంగా ఉందని, అందుకే థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనలేకపోతున్నామన్నారు. అలాంటప్పుడు అదానీ సంస్థ నుంచి 10 వేలమెగావాట్ల విద్యుత్ కొనడానికి, రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం వేయడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమైందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష
రూ.20 వేల కోట్లకు పైగా ప్రభుత్వ బకాయిలు
టీడీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ తప్పని వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. విద్యుత్ రంగ సంస్థల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిందో కూడా ప్రభుత్వమే చెప్పాలని పయ్యావుల ప్రశ్నించారు. విద్యుత్ వినియోగదారులు బిల్లుల తాలూకా సొమ్ముచెల్లించడం ఆపేశారా? పైసాతో సహా వారి నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న నగదు ఏమవుతుందని ప్రశ్నించారు. కొనుగోలు చేస్తున్న విద్యుత్ తాలూకా సొమ్ముని కూడా ప్రభుత్వం సదరు సంస్థలకు చెల్లించడంలేదన్నారు. కనీసం 50 శాతం సొమ్మునైనా విద్యుత్ సంస్థలకు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం సదరు సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వనందునే నష్టాల్లో కురుకుపోయాయని తెలిపారు. ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపైనే మోపారని ఆరోపించారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు చెల్లించని కారణంగా దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బకాయిపడిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Also Read: విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు