By: ABP Desam | Updated at : 08 Oct 2021 05:54 PM (IST)
ట్రూ అప్ చార్జీల ఉత్తర్వులు రద్దు
ట్రూ అప్ పేరుతో గత రెండు నెలలుగా అదనంగా వసూలు చేస్తున్న చార్జీలను హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఛార్జీల పెంపు విషయంలో సరైన పద్ధతి పాటించ లేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనందున హైకోర్టులో ఎదురు దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతో ట్రూ అప్ చార్జీలపై ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలని నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి ఇచ్చే ముందు ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. కానీ అలాంటిదేమీ చేయకుండానే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై తుది ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చుల కింద.. వినియోగదారుల నుంచి రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు నుంచి వీటి వసూలు మొదలైంది. ఈ చార్జీల విధింపుతో బిల్లులు భారీగా వస్తుండడంతో వినియోగదారుల్లో గగ్గోలు మొదలైంది.
నిబంధనల ప్రకారం ట్రూ అప్ చార్జీల విధింపునకు ముందు స్థానిక దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ పత్రికల్లో ఏ సమాచారం ప్రచురించకుండా చార్జీల విధింపుపై నిర్ణయం తీసుకున్నారని ఈ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తప్పు జరిగిందని ఈఆర్‌సీ గుర్తించింది. వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. అయితే ఈ చార్జీలు తగ్గింపు తాత్కాలికమే. వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఈఆర్‌సీ మరో ఉత్తర్వులో పేర్కొంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది.
Also Read : ‘మా’కు మోడీకి ఏంటి సంబంధం ? ‘అతి’ స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !
ట్రూ అప్ చార్జీల వసూలుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో .. రెండు నెలలుగా వసూలు చేస్తున్న చార్జీలను వెనక్కి ఇస్తారా అన్న సందేహం వినియోగదారుల్లో ప్రారంభమయింది. ఎలా చూసినా ఆ చార్జీల వసూలు నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. హైకోర్టులో జరిగే విచారణలో ఏం జరుగుతుందో కానీ.. ట్రూ అప్ చార్జీలు మాత్రం ఈ నెల 19న ప్రజాభిప్రాయసేకరణ తర్వాత ఏపీఈఆర్సీ పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వచ్చే నెలలో మళ్లీ ట్రూ అప్ చార్జీలు మళ్లీ పెరుగుతాయన్నమాట
Also Read : నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్
TDP Mahanadu: జగన్ ది రాక్షసపాలన, ఎటు చూసినా దోపిడీ! మహానాడులో టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు
పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!
NTR on Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై ఎన్టీఆర్ నిలువెత్తు రూపం, భారీ స్క్రీన్‌పై ప్రదర్శన
Kodali Nani: వచ్చే ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదు, దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చేయండి - బాబు, లోకేశ్‌కు కొడాలి నాని సవాల్
IPL 2023 Final: కప్ ఎవరిదైనా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు వీరికే - ఇద్దరూ గుజరాత్ ప్లేయర్లే!
RGV: ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి
కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి