X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Pawan Kalyan: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్

ఏపీ ఆర్థిక పరిస్థితి ఎటుపోతుందని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్లు సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఏపీ ఉందని విమర్శలు చేశారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సందర్భం దొరినప్పుడల్లా వైసీపీ సర్కార్ పై పవన్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఏపీ సర్కార్ పై వాగ్బాణాలు సంధించారు. ఏపీలో ఆర్థిక నియంత్రణ లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం, అప్పులపై పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎటుపోతుందో అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నలను సంధించారు. ప్రభుత్వ, రిటైర్డు ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు సకాలంలో అందించలేకపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తాయనే మాటను మర్చిపోయి చాలా కాలం అయిందన్నారు. ఎప్పుడు జీతాలు, పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర  ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే ఇందుకు కారణమని పవన్ ఆరోపించారు. 


Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?


ఎంత కాలం ఇలా...


రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. దశాబ్దాల పాటు సర్వీస్ చేసిన వారు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటారన్నారు. వృద్ధ్యాప్యంలో వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ ఆధారమన్నారు. పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో వారంతా మానసికంగా వేదనకు లోనవుతారని పవన్ అన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునన్న పవన్.. జీతం, పెన్షన్ తో ఎంతో ఆత్మాభిమానంగా జీవిస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతంతో ఉద్యోగులు ప్రణాళికతో ఖర్చు చేసుకుంటాన్నారు. బ్యాంక్ లోన్ల వాయిదాలు, పిల్లల చదువులు, ఖర్చులు, ఇతర అవసరాలు ప్లాన్ చేసుకుంటారన్నారు. సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంత కాలం వారు చేబదుళ్లతో జీవితం నెట్టుకుని రావాలని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Watch Video  : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


ప్రభుత్వ ఆదాయం ఎటు పోతుంది?


నిరంతరం డ్యూటీలో ఉండే పోలీస్ శాఖ సిబ్బందికి 11 నెలల నుంచి టీఏ చెల్లించడం లేదని పవన్ అన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ 7 డీ.ఏలు బకాయిలు చెల్లించాలని గుర్తుచేశారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. జీతం ఇవ్వడమే ఆలస్యం చేస్తే ఇక డీఏటీఏ, పీఆర్సీలు అడగరని, జీతం వస్తే చాలనుకుంటారని ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే అదాయం గత అధిక సంవత్సరం కన్నా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయని పవన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ నిర్వహణలో భాగంగా జీతభత్యాల చెల్లింపులు చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటు పోతుందని ప్రశ్నించారు. 


Also Read: పెళ్లి చేసుకుంటావా? లేదా? సచివాలయ ఉద్యోగికి వేధింపులు.. నెల్లూరు జిల్లాలో ఘటన..


తాకట్టులో ఏపీ


తాకట్టులో ఆంధ్రప్రదేశ్​ పేరుతో పవన్ ఒక ఛార్ట్ ను పోస్టు చేశారు. విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్నులను జనసేనాని నవరత్నాలతో పోల్చారు. భావితరాలకు మిగిలేది అప్పులేనన్నారు. కొందరికి మాత్రమే నవరత్నాలు ఇస్తున్నారని తెలిపారు. పన్నులు మాత్రం అందరి నుంచి భారీగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థికవృద్ధి అథఃపాతాళానికి చేరిందని ఎద్దేవా చేశారు పవన్. 


Also Read: CM Jagan : పాదయాత్రలో చూసి కష్టాలు తీరుస్తున్నా .. ! రెండో విడత ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: pawan kalyan cm jagan ap govt janasena AP Latest news political news AP govt economic condition

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Weather Alert: ఏపీలో వానలు.. ఆ జిల్లాల్లో ఎఫెక్ట్..  ఈశాన్య రుతుపవనాల రాక

Weather Alert: ఏపీలో వానలు.. ఆ జిల్లాల్లో ఎఫెక్ట్..  ఈశాన్య రుతుపవనాల రాక

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిదులు.. కారణం తెలిసి స్థానికులు షాక్

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిదులు.. కారణం తెలిసి స్థానికులు షాక్

Hyderabad Metro: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్

Hyderabad Metro: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...