X

NTR Call To Fan: నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్

జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద మనసు చాటారు. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పారు.

FOLLOW US: 

సినిమాలతో ఎంతో అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తెరపైనే కాదు, తెర బయట కూడా తాను హీరోనే అనిపించుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమానికి వాట్సాప్ కాల్ చేసి.. ‘‘నీకు నేనున్నా తమ్ముడూ’’ అంటూ ధైర్యం చెప్పారు. ఆ వీరభిమాని కన్నీటిని తుడిచేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం.. గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కిడ్నీలు పాడైపోయాయి. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మురళి జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఈ సందర్భంగా మురళి తన చిరకాల కోరికను పేపరు మీద రాసి డాక్టర్‌కు ఇచ్చాడు. తనకు ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని అందులో పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తన అభిమానికి వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయారు. వెంటనే వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నువ్వు త్వరగా కోలుకుంటావు, త్వరలోనే మనం కలుద్దామని ఎన్టీఆర్.. మురళికి, అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు! 

రోడ్డు ప్రమాదాలపై ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన అభిమానులను హెచ్చరిస్తూనే ఉంటారు. తన సోదరుడు జానకి రామ్, తండ్రి నందమూరి హరికృష్ణ సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు తమ సొంత చిత్రాల్లో రోడ్డు ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంటారు. తాజాగా తన అభిమాని కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని ఎన్టీఆర్ ఆందోళన చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ‘RRR’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు

Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం: ప్రకాష్ రాజ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ntr Jr NTR జూనియర్ ఎన్టీఆర్ Jr NTR talks to fan NTR talks to Fan Jr NTR video Call NTR Call To Fan

సంబంధిత కథనాలు

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

TRS Harish Kavita : ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

TRS Harish Kavita :  ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?