Jogulamba Gadwal: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి
ఓ కుటుంబంలో రోజూలాగే అందరూ కలిసి భోజనం చేశారు. సమయం కాగానే నిద్ర పోయారు. కానీ, ఆ నిద్రలోనే వారు శాశ్వత నిద్రలోకి వెళ్లాల్సి వచ్చింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గద్వాల జిల్లాలోని అయిజ మండలం కొత్తపల్లిలో ఓ ఇంటి పైకప్పు కూలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాత్రి వేళ ఇంట్లో ఏడుగురు నిద్ర పోతుండగా.. పాతకాలపు గోడ కూలిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలివీ..
Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..
అయిజ మండలం కొత్తపల్లిలోని ఓ కుటుంబంలో రోజూలాగే అందరూ కలిసి భోజనం చేశారు. అమ్మా నాన్న టీవీ చూస్తుంటే.. పిల్లలంతా టీవీ చూశారు. సమయం కాగానే నిద్ర పోయారు. ప్రతి రోజూలాగే మరో కొత్త రోజుకు స్వాగతం పలుకుదామనే తలంపుతో అంతా నిద్రపోయారు. కానీ, ఆ నిద్రలోనే వారు శాశ్వత నిద్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ లోపు ఊహించని ఘటన జరిగింది. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పిడుగుపడ్డట్లు వారి మీద ఇంటి నిర్మాణం కూలింది. ఆ ఇంట్లో ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.
Also Read: Woman Death: ఇంట్లో తల్లి శవం.. రెండ్రోజులుగా పెద్ద శబ్దాలు, ఏంటని ఆరా తీసి షాకైన పోలీసులు
ఆ కుటుంబంలోని మృతులు మోషా, సుజాతమ్మ, చరణ్, రాము, తేజగా పోలీసులు గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి పాతకాలపు ఇల్లు నాని పైకప్పు కూలిందని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని పోస్టుమార్టం చేసేందు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
గద్వాల జిల్లాలో ఐదుగురు చనిపోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని సీఎం ఆదేశించారు.
Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..
Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
Also Read: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. అధికారికంగా ప్రకటించిన న్యాయ మంత్రి !