X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Disha APP: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..

పగలు రాత్రి అనే తేడా లేకుండా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. యువతిని వేధిస్తున్న ఆకతాయిని దిశా యాప్ సహాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 

మహిళలు, యువతులు, బాలికలు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా వారు అర్ధరాత్రి బయటకు వెళితే.. ఏ సమయానికి ఇంటికి తిరిగొస్తారు, కాస్త ఆలస్యమైతే అసలు తిరిగి చేరుకుంటారా లేదా  అని తల్లిదండ్రులలో ఆందోళన మొదలవుతోంది. చిన్నారులతో పాటు వృద్ధులను సైతం కీచకులు వదలడం లేదు. ఎన్ని చట్టాలు అమలవుతున్నా.. పగలు రాత్రి అనే తేడా లేకుండా లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అయితే తన వద్ద ఉన్న దిశా యాప్ ద్వారా తనను రక్షించుకోగలిగింది. పోలీసులు ఆ ఆకతాయి ఆట కట్టించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..

చిత్తూరు జిల్లా మదనపల్లె బస్టాండ్‌లో ఓ విద్యార్ధిని బస్సు కోసం ఎదురుచూస్తోంది. మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న ఆ యువతి కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చింది. బస్సు కోసం గంటపాటు ఎదురుచూసింది. అయినా బస్సు రాకపోవడంతో అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. ఐటీ చదువుతున్న విద్యార్థి పవన్ ఆ యువతికి దగ్గర కావాలని ప్రయత్నించాడు. బస్సు రాకపోవడాన్ని అదనుగా భావించిన యువకుడు యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?

మొదటగా ఆ యువతి ఆకతాయిని వారించింది. అతడికి దూరం జరిగినా ఆకతాయి మాత్రం వేధింపులు కొనసాగించాడు. అతడి వికృత చేష్టలను భరించలేని విద్యార్థినికి ఓ ఐడియా వచ్చింది. కాలేజీలో ఓ మహిళా పోలీస్ ద్వారా ఇటీవల డౌన్ లోడ్ చేసుకున్న దిశా యాప్ గుర్తుకొచ్చింది. వెంటనే తన మొబైల్ బయకు తీసి ఎస్ఓఎస్ ద్వారా ఆకతాయి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని పోలీసులకు సమాచారం అందించింది. దిశా యాప్ నుంచి తమకు ఫిర్యాదు అందగానే కంట్రోల్ రూమ్ సిబ్బంది మదనపల్లె టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. 

Also Read: అధికారులు తనిఖీలకొచ్చారని బార్లలోని మందుబాబులు పరార్ ! కానీ అసలు విషయం తెలిసిన తర్వాత...

టౌ టౌన్ పోలీసులు నిమిషాల వ్యవధిలో మదనపల్లె బస్టాండ్‌కు చేరుకున్నారు. యువతిని వేధిస్తున్న ఐటీ విద్యార్థి పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కష్ట కాలంలో భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్న విద్యార్థినిని దిశా పోలీసులు అభినందించారు. సకాలంలో దిశా యాప్ ద్వారా అలర్ట్ చేయడంతో ఆమెను రక్షించగలిగామని పోలీసులు తెలిపారు. బాలికలు, యువతులు, మహిళలు తమ ఫోన్లో దిశా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని.. తద్వారా కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడతారని చెప్పారు.

Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Crime News Disha Act Disha APP Madanapalle Madanapalle Police Station Student harassment

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Coronavirus Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులే అధికం

Coronavirus Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులే అధికం

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..

Petrol-Diesel Price, 25 October: అన్ని నగరాల్లో మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..

Petrol-Diesel Price, 25 October: అన్ని నగరాల్లో మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?