అన్వేషించండి

Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?

Siya Goyal polygraph test: పుణె కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సియా గోయల్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Ketan Agarwal case: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగడ్ కోట వద్ద లోయలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న సియా గోయల్ ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో, పుణె రూరల్ పోలీసులు ఆమెను వడ్గావ్ మావల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, కేతన్ అగర్వాల్‌ను కోటపై నుంచి అసలు ఎవరు నెట్టారు? అనే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన, ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు నివేదించడం ఈ కేసులో తీవ్ర సంచలనంగా మారింది.               

ఈ కేసు విచారణలో నిందితురాలు సియా గోయల్ పోలీసులకు అస్సలు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు అంటున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఇద్దరి మొబైల్ డేటా విశ్లేషణ ఆధారంగా ఆమె నిజాలు దాస్తోందని భావిస్తున్న పోలీసులు.. కోర్టు ముందు కీలక ప్రతిపాదన పెట్టారు. ఈ కేసులోని అసలు గుట్టును, కుట్రను విరబోయాలంటే ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు  పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని, అందుకు అనుమతించాలని కోర్టును కోరారు.

పుణె పోలీసుల కథనం ప్రకారం.. కేతన్, సియా ఇద్దరూ లోహగడ్ కోటను సందర్శించిన సమయంలో   కేతన్ కో లోయలోకి పడి మరణించాడు. పోలీసుల దర్యాప్తులో సియా గోయల్ ఆమె ప్రియుడి చేతన్ చౌదరితో కలిసి కుట్ర చేసి చంపేసిందని తేలింది.  కానీ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.  పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా సియా మానసిక స్థితిని, ఆమె చెబుతున్న సమాధానాల్లోని నిజానిజాలను శాస్త్రీయంగా విశ్లేషించవచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది.

మరోవైపు, ఈ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణపై కోర్టు నిందితురాలు సియా గోయల్ న్యాయపరమైన సమ్మతిని కోరింది. చట్టప్రకారం నిందితురాలి అనుమతి లేకుండా ఇలాంటి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున, దీనిపై తదుపరి విచారణలో కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి సియా గోయల్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లోహగడ్ కోట వంటి పర్యాటక ప్రాంతాల్లో రక్షణ లోపాలు, సిసిటివి కెమెరాలు లేకపోవడం వల్లే ఇలాంటి కేసుల్లో డిజిటల్ ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఐటీ కారిడార్ అయిన పుణెలో ఈ కేతన్ అగర్వాల్ మృతి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఒక యువ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవడానికి వెనుక ఉన్న బలమైన కారణాలను బయటకు తీయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోర్టు గనుక పాలిగ్రాఫ్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ లోహగడ్ కోట డెత్ మిస్టరీలోని అసలు నిజాలు ,  సియా గోయల్ దాస్తున్న రహస్యాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని లీగల్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.                     

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget