అన్వేషించండి

Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !

Siya Goyal Fiance Murder Plot: పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి షాపింగ్ పేరిట రూ.1 కోటి వసూలు చేసి, ప్రియుడికి ఇచ్చింది సియా.

Ketan Agarwal Murder Mystery:   మహారాష్ట్రలోని పుణే నగరంలో జూన్ 18న జరిగిన 26 ఏళ్ల యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. ప్రమాదవశాత్తూ లోహగఢ్ కోట లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ కేసు.. పోలీసుల లోతైన దర్యాప్తులో ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన 'లవ్ అండ్ మర్డర్' మిస్టరీగా తేలింది. కేతన్ కాబోయే భార్య, 20 ఏళ్ల సియా గోయల్ తన సీక్రెట్ ప్రియుడు చేతన్ చౌదరి  తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పుణే పోలీసులు నిర్ధారించారు.  

కేతన్ డబ్బుతో చేతన్‌ను సెటిల్ చేయాలనుకున్న సియా 

పోలీసుల విచారణలో బయటపడిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితురాలు సియా గోయల్ పెళ్లి షాపింగ్ నెపంతో కాబోయే భర్త కేతన్ నుంచి దాదాపు రూ.1 కోటి రూపాయలు డ్రా చేసింది. ఆ సొమ్ముతో షాపింగ్ చేయకుండా.. ఆర్థికంగా వెనుకబడిన తన ప్రియుడు చేతన్ చౌదరికి అందజేసింది. చేతన్ తన బిజినెస్ సెటిల్ చేసుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి కనీసం 3 ఏళ్ల సమయం పడుతుందని చెప్పడంతో.. వీరిద్దరూ ఒక పక్కా టైమ్‌లైన్ రాసుకున్నారు. కేతన్ హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం సియా మరో మూడేళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని, ఆ తర్వాత కేసు చల్లబడ్డాక, చేతన్ సెటిల్ అయ్యాక ఇద్దరూ పెళ్లి చేసుకుని సియా కుటుంబ సభ్యులను ఒప్పించాలని ప్లాన్ చేసుకున్నారు.
 
 హత్యకు వాడిన సీక్రెట్ కోడ్ 

లోహగఢ్ కోటపై కేతన్‌ను నెట్టేసే సమయంలో సియా ఒక వింత సిగ్నల్ ఇచ్చింది. నీళ్లు తాగే నెపంతోనో లేదా షూ లేస్ కట్టుకునే నెపంతోనో ఆమె కిందకు కూర్చోవాలి. ఆమె అలా కిందకు కూర్చున్న వెంటనే వెనుక నుంచి చేతన్ వచ్చి కేతన్‌ను లోయలోకి నెట్టేయాలి. కేతన్ పడిపోయేటప్పుడు ప్రాణభయంతో సియాను పట్టుకుంటే ఆమె కూడా లోయలో పడిపోతుందనే భయంతో.. ఆమె సేఫ్టీ కోసం ఈ సిట్టింగ్ సిగ్నల్  కోడ్‌ను ముందే డిజైన్ చేసుకున్నారు.

సీసీ కెమెరాలకు చిక్కకుండా చేతన్ ప్లాన్ 
  
ఈ ఘోరానికి పాల్పడే ముందు నిందితుడు చేతన్ చౌదరి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించాడు. టోల్ ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు పుణే నుంచి లోహగఢ్ కోట వరకు ఉన్న 90 కిలోమీటర్ల దూరాన్ని కార్‌లో కాకుండా ఒక స్కూటర్‌పై ప్రయాణించి కేతన్, సియాలను ఫాలో అయ్యాడు. హత్య జరగడానికి సరిగ్గా 34 నిమిషాల ముందు సియా, చేతన్‌ల మధ్య జరిగిన ఒక రహస్య ఫోన్ కాల్.. ఈ మర్డర్ ప్లాన్‌కు ఫైనల్  గో అహెడ్'  అని కాల్ డేటా రికార్డుల  ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ స్కూటర్‌తో పాటు వారి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిజానికి కేతన్‌ను చంపడానికి మే నెల ఆఖరి వారంలోనే ప్లాన్ ఖరారైంది. జూన్ 14న లోహగఢ్ కోటపైనే మొదటిసారి కేతన్‌ను నెట్టేయడానికి సియా ప్రయత్నించింది. కానీ, అదృష్టవశాత్తూ కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో సియా తెలివిగా.. అక్కడ పాము వచ్చిందని, దానికి భయపడి నిన్ను నెట్టేశానంటూ ఒక కట్టుకథ చెప్పి కేతన్‌ను నమ్మించింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో, రెండోసారి జూన్ 18న కేతన్ ఎలాగైనా చనిపోవాలనే ఉద్దేశంతో ప్రియుడు చేతన్ స్వయంగా రంగంలోకి దిగి లోయలోకి తోసేసి హతమార్చాడు. ఈ క్రూరమైన కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు కఠిన శిక్ష పడేలా ఆధారాలను కోర్టు ముందు ఉంచే పనిలో ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget