అన్వేషించండి

Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

నాలుగేళ్ల కిందట జరిగిన ధరావత్ నిఖిల్ పరువు హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. యువతి కుటుంబసభ్యులు నిఖిల్ ను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాలుగేళ్ల క్రితం ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి పరువు హత్యగా మారింది.
  • ప్రేమించిన అమ్మాయి కుటుంబసభ్యులే నిఖిల్ ను హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ.
  • పోలీసులు, సీఐడీ దర్యాప్తులో న్యాయం జరగలేదని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.
  • హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది.

Honor Killing Case | హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ పరువు హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు తెలంగాణ హైకోర్టు సిబిఐ (CBI) విచారణకు ఆదేశించింది. లా డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిఖిల్.. బర్త్‌డే పార్టీకి వెళ్లగా, ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

యువతి కుటుంబసభ్యులే హత్య చేశారు: నిఖిల్ తల్లిదండ్రుల ఆరోపణలు
బాధితుడు నిఖిల్ తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కారణంగా ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో నిఖిల్‌ను కిడ్నాప్ చేసి, ఉరివేసి దారుణంగా హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఇంట్లోనే ఉన్న నిఖిల్‌ను బర్త్‌డే పార్టీ ఉందంటూ కొందరు వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిఖిల్ కనిపించకుండా పోవడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో తాము కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిఖిల్ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత, చిలుకూరు సమీపంలోని ఒక కాలువలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

Also Read: Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
ఈ కేసు తీవ్రతను బట్టి గతంలోనే ప్రభుత్వం దీనిపై సిఐడి (CID) విచారణకు ఆదేశించింది. అయితే, అటు స్థానిక పోలీసుల దర్యాప్తులోనూ, ఇటు సిఐడి విచారణలోనూ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన అసలైన నిందితులను కాపాడుతున్నారని నిఖిల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. నిఖిల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సోమవారం నాడు (జూన్ 29న) సంచలన తీర్పునిచ్చింది.

2022 అక్టోబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలో సూర్యాపేటకు చెందిన 22 ఏళ్ల లా పట్టభద్రుడు ధరావత్ నిఖిల్ మృతదేహం లభించింది. అయితే అగ్రకులానికి చెందిన యువతితో ఇంటర్మీడియట్ నుంచి ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.  నిఖిల్ గిరిజనుడు కావడంతో అమ్మాయి కుటుంబం, బంధువులు తమ కుమారుడ్ని పరువు హత్య చేశారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. 

Frequently Asked Questions

ధరావత్ నిఖిల్ కేసులో కీలక మలుపు ఏమిటి?

ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో తెలంగాణ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇది పరువు హత్య కేసుగా భావించబడుతోంది.

నిఖిల్ తల్లిదండ్రులు మునుపటి దర్యాప్తులతో ఎందుకు అసంతృప్తి చెందారు?

స్థానిక పోలీసుల, సీఐడీ విచారణలో తమకు న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. అసలైన నిందితులను కాపాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిఖిల్ మరణానికి ఆరోపించిన కారణం ఏమిటి?

నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల, ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి, ఉరివేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిఖిల్ మృతదేహం ఎప్పుడు, ఎక్కడ లభించింది?

2022 అక్టోబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలో నిఖిల్ మృతదేహం లభించింది. చిలుకూరు సమీపంలోని ఒక కాలువలో పోలీసులు దానిని గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget