అన్వేషించండి

Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి

ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎగ్జిట్ మిస్ అయిందని కారును రివర్స్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదంలో కారు రివర్స్‌ చేయగా, నలుగురు మృతి.
  • ఎగ్జిట్ మిస్సవడంతో రివర్స్ చేయడం, అతివేగం ప్రమాదానికి ప్రధాన కారణం.
  • రోడ్డు భద్రతా నియమాలు, క్రమశిక్షణ లేకపోతే ఘోర పరిణామాలు తప్పవు.

Delhi Dehradun Expressway Road Accident | న్యూఢిల్లీ: రోడ్డు మీద ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మనం మాత్రమే కాదు, అవతలి వ్యక్తి సైతం రోడ్ సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఒక చిన్న నిర్లక్ష్యం, అవగాహన లేమితో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా డ్రైవర్ ఎగ్జిట్ మిస్ అయిన తర్వాత కారును రివర్స్ చేస్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఎస్‌యూవీ వీరి కారును ఢీకొట్టింది. రివర్స్ చేస్తున్న కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో హైవేలపై రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే జరిగే పరిణామాలకు నిదర్శనంగా నిలిచింది. 

ఎక్స్‌ప్రెస్‌వేపై ఎగ్జిట్ మిస్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం రివర్స్ చేయవద్దు. కొంచెం ముందుకు వెళ్లి తరువాత ఎగ్జిట్ వద్ద దిగి మళ్లీ రావడమే సురక్షితమని అధికారులు సూచించారు.  హై స్పీడ్, లాంగ్ డిస్టెన్స్, మోడరన్ ఫీచర్లు ఉన్నప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఘోర పరిణామాలకు దారితీస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై సురక్షితమైన డ్రైవింగ్ అనేది కేవలం రూల్స్ పాటించడం మాత్రమే కాదు, నిరంతరం అప్రమత్తతతో పాటు ఓపిక,  బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తలు పాటిస్తే మీతో పాటు అవతలి వ్యక్తుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఎక్స్‌ప్రెస్‌వేపై స్పీడ్ కంట్రోల్
ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్ణీత వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించాలి. సాధారణంగా వేగ పరిమితి గంటకు 80- 100 కిలోమీటర్లు మధ్య ఉంటుంది, కానీ వాతావరణం, ట్రాఫిక్‌ను బట్టి స్పీడ్ తగ్గించి నడపాలి. ముఖ్యంగా హైవేలపై వేగంగా వెళ్తూ అకస్మాత్తుగా బ్రేకులు వేయడం మానుకోవాలి. ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించండి. తాజా రోడ్డు ప్రమాదంలో అతివేగం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరోవైపు ఎగ్జిట్, ఎంట్రీ మిస్ అయిన వాహనదారులు అదే మార్గంలో రివర్స్ చేసుకోవడం సైతం ప్రమాదాలకు కారణం అవుతుంది. 

Also Read: Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

లేన్ డిసిప్లిన్, ఓవర్‌టేక్ చేయడం
ఎల్లప్పుడూ ఎడమ లేన్‌లోనే ఉండాలి. కుడి లేన్‌ను ఓవర్‌టేకింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలి. లేన్ మార్చేటప్పుడు ఇండికేటర్ కచ్చితంగా వేయాలి. సైడ్ మిర్రర్స్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా వాహనం నడపాలి. ఇండికేటర్ వేయకుండా లేన్ మార్చడం లేదా తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను రైట్ లేన్‌లో ఆపడం ప్రాణాల మీదకు తెస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను రివర్స్ తీయడం లేదా రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. 

చిన్నపాటి యాక్సిడెంట్ లేదా బ్రేక్‌డౌన్ అయినప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేయడంతో పాటు వీలైతే రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్ ఉంచాలి. NHAI హెల్ప్‌లైన్ లేదా యాప్‌ను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడంతో పాటు రోడ్ సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయడం ద్వారా చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు.

Frequently Asked Questions

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర ప్రమాదానికి కారణం ఏమిటి?

డ్రైవర్ ఎగ్జిట్ మిస్ అయిన తర్వాత కారును రివర్స్ చేస్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఎస్‌యూవీ ఢీకొట్టింది. చిన్నపాటి నిర్లక్ష్యం, అవగాహన లేమి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాయి.

ఎక్స్‌ప్రెస్‌వేలపై సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడంతో పాటు నిరంతరం అప్రమత్తత, ఓపిక, బాధ్యతగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీతో పాటు అవతలి వ్యక్తుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనదారులు వేగ నియంత్రణను ఎలా పాటించాలి?

నిర్ణీత వేగ పరిమితిని (80-100 కి.మీ/గంట) ఖచ్చితంగా పాటించాలి. వాతావరణం, ట్రాఫిక్‌ను బట్టి వేగం తగ్గించి, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి.

ఎక్స్‌ప్రెస్‌వేలపై లేన్ డిసిప్లిన్ మరియు ఓవర్‌టేకింగ్ నియమాలు ఏమిటి?

ఎల్లప్పుడూ ఎడమ లేన్‌లోనే ఉండాలి. కుడి లేన్‌ను ఓవర్‌టేకింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలి. లేన్ మార్చేటప్పుడు ఇండికేటర్ వేసి, సైడ్ మిర్రర్స్ చెక్ చేసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget