అన్వేషించండి

Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం

Bengaluru Crime News | పెళ్లి చేసుకోవాలని పెట్రోల్ బాంబు, కత్తితో బెదిరించడంతో ప్రియురాలు కారు నుంచి బయటకు దూకింది. ఆ వెంటనే కారులో బాంబు పేలి ప్రియుడు సజీవదహనం అయ్యాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రియురాలు దూరం కావడంతో నాగేంద్ర కారులో ఆమెను తీసుకెళ్లాడు.
  • పెళ్లికై బెదిరిస్తూ, కత్తితో దాడిచేయగా ఆమె కారులోంచి దూకేసింది.
  • పెట్రోల్ బాంబు పేలి కారులో ఇరుక్కుని నాగేంద్ర సజీవదహనం.

Bengaluru Horror Man Dies in Car | బెంగళూరు: ఈ మధ్య కాలంలో లవ్ అఫైర్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తనను ప్రేమించాలని, లేక పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం.. ఆపై హత్య చేయడమో, లేక ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనే కర్ణాటకలో శనివారం ఒకటి జరిగింది. కారులో వెళ్తూ పెట్రోల్‌ బాంబుతో లవర్‌ను బెదిరించాలని చూసిన యువకుడు, చివరికి కారులోనే సజీవదహనం కావడం కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు జయనగరకు చెందిన ఓ యువతి స్థానిక సంజయ్‌ గాంధీ ఆసుపత్రిలో ఓటీ (OT) టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు, నాగేంద్ర అనే 30 ఏళ్ల యువకుడితో ఆరేళ్లుగా పరిచయం ఉంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, కొన్ని రోజుల నుంచి ఆమె నాగేంద్రకు దూరంగా ఉంటోంది. అతని ప్రవర్తన నచ్చక నాగేంద్ర సెల్‌ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసి, మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అయితే ప్రియురాలు తనను దూరం పెట్టడాన్ని నాగేంద్ర భరించలేకపోయాడు. అసలు సంగతేంటో తేల్చాలని భావించాడు.

తన ప్లాన్ ప్రకారం నాగేంద్ర శనివారం (జూన్ 27న) ఒక కారును అద్దెకు తీసుకొని ప్రియురాలు రూముకు వెళ్లాడు. తనతో కొన్ని విషయాలు మాట్లాడాలంటూ అంకోలాకు రావాలంటూ గొడవ చేశాడు. దాంతో ఉదయం ఏడు గంటలకే వీరిద్దరూ బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. కారు తుమకూరు దాటిన తర్వాత, తనను ఎందుకు దూరం పెడుతున్నావని, తనను వివాహం చేసుకోవాలని నాగేంద్ర యువతిని కోరాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని పెట్రోల్‌ బాంబు తీసి ఆమెను బెదిరించాడు. అయినా ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నాగేంద్ర మొదట ప్రియురాలి తల, చేతులపై కత్తితో దాడి చేశాడు.

ఈ క్రమంలో డ్రైవర్ కారును జోగిహళ్లి ప్రాంతానికి తీసుకెళ్లాడు. పరిస్థితి గమనించిన డ్రైవర్ కారు కొంచెం స్లో చేయగా.. ఇది గమనించిన యువతి, వెంటనే కారు డోర్ ఓపెన్ చేసి బయటకు దూకేసింది. పెట్రోల్ బాంబుతో పేల్చివేస్తాడేమోనని భయపడి డ్రైవర్ సైతం వెంటనే కిందకు దూకేశాడని పోలీసులు తెలిపారు. వెంటనే సెకన్ల వ్యవధిలోనే కారులో పెట్రోల్‌ బాంబు పేలింది. నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. మంటలు త్వరగా చెలరేగడం పెట్రోల్ బాంబు పేలడంతో షాకైన నాగేంద్ర కారు నుంచి బయటకు రాలేకపోయాడు. దాంతో కారులోనే క్షణాల్లో సజీవదహనమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలని చంపేందుకు నాగేంద్ర యత్నించగా పెట్రోల్ బాంబు పేలిందా.. లేక ప్రమాదవశాత్తు పేలిందా, ఆత్మహత్య చేసుకోవాలని పేల్చాడా అని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 

Frequently Asked Questions

కర్ణాటకలో జరిగిన సంఘటన ఏమిటి?

బెంగళూరులో ఒక యువకుడు తన ప్రియురాలిని పెట్రోల్ బాంబుతో బెదిరించి, కత్తితో దాడి చేశాడు. కారులో పెట్రోల్ బాంబు పేలి సజీవదహనమయ్యాడు.

ఈ సంఘటనలో ఎవరు ఉన్నారు?

జయనగరకు చెందిన ఒక యువతి, సంజయ్ గాంధీ ఆసుపత్రిలో OT టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఆరేళ్లుగా పరిచయం ఉన్న నాగేంద్ర అనే 30 ఏళ్ల యువకుడితో ఈ సంఘటన జరిగింది.

నాగేంద్ర ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు?

తన ప్రియురాలు దూరంగా ఉండటం, తన నంబర్ బ్లాక్ చేయడంతో నాగేంద్ర అసలు సంగతేంటో తేల్చాలని భావించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.

నాగేంద్ర ఎలా మరణించాడు?

ప్రియురాలు, డ్రైవర్ కారు నుంచి దూకిన తర్వాత కారులో పెట్రోల్ బాంబు పేలింది. మంటలు వేగంగా వ్యాపించడంతో నాగేంద్ర బయటకు రాలేక కారులోనే సజీవదహనమయ్యాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget