News
News
X

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

శ్రీకాకుళానికి ముందెన్నడూ తెలియని రీతిలో దాడులు, హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌ సంస్కృతికి తెరలేపుతున్నారు. సుపారీ గ్యాంగులు, బెట్టింగ్, గంజాయి ముఠాలు తిష్ట వేసి ఆ ప్రాంతాన్ని నేరమయం చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

చిన్న పట్టణం.. ప్రశాంతతకు నిలయమైన శ్రీకాకుళం. ఇప్పుడిప్పుడే ప్రగతి బాటలు అడుగులు వేస్తున్న ఈ ప్రాంతంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అశాంతి రేపుతున్నారు. శ్రీకాకుళానికి ముందెన్నడూ తెలియని రీతిలో దాడులు, హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌ సంస్కృతికి తెరలేపుతున్నారు. సుపారీ గ్యాంగులు, బెట్టింగ్, గంజాయి ముఠాలు తిష్ట వేసి ఆ ప్రాంతాన్ని నేరమయం చేస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, ఆగంతకుల కదలికలను నిరంతర కనిపెట్టి, పట్టుకోవాల్సిన వ్యవస్థల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కేసులు పెరుగుతున్నా వాటి దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. అనేక కేసులు ఏళ్ల తరబడి విచారణలో ఉంటూ ఎప్పుడు పరిష్కారం అవుతాయో పోలీసులే చెప్పలేని పరిస్థితి ఉంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు నేరాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నిఘా నిర్లక్ష్యం, దర్యాప్తుల్లో నిర్లిప్తత ఏళ్ల తరబడి పలు కేసులను కంచికి చేరని క్రైమ్ కథలుగా మార్చేస్తున్నాయి.

పారిశ్రామికాభివృద్ధిలో వెనుకబడినా.. వైద్య, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న శ్రీకాకుళంలో కొంత కాలంగా ప్రశాంతతకు విఘాతం కలుగుతోంది. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా పేరొందిన ఈ జిల్లాలో రాజకీయ, వ్యక్తిగత, వ్యాపార కక్షలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు చాలా తక్కువ. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపార, వృత్తి వ్యవహరాలపై వలస వచ్చి స్థిరపడినవారే జనాభాలో సగం మంది ఉన్నారు. వీరే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైం రేట్ పెరుగుతోంది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్, పేకాట, గంజా అక్రమ మద్యం ముఠాలకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరహా అనేక ఘటనలు వెలుగు చూడటమే దీనికి నిదర్శనం. ఈ వ్యవహారాలు కొందరు పోలీస్‌లకు తెలిసే జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నేరాలతో రెచ్చిపోతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న గ్యాంగ్‌లు పేట్రేగిపోతున్నాయని చెప్పడానికి ప్రముఖ వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్ యత్నమే తాజా ఉదాహరణ.

కన్ను చేరేస్తున్న నిఘా

సుపారీ గ్యాంగ్‌లతో హత్యాయత్నాలు చేసిన ఘటనలు ఇది వరకే వెలుగు చూశాయి. ఇటువంటి ముఠాలు, నేరగాళ్ల కదలికలను నిరంతరం కనిపెట్టాల్సిన నిఘా వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా లేదా అన్ని అనుమానం కలుగుతోంది. జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని పోలీసు అధికారులు ప్రకటించడం తప్ప కేసుల్లో పురోగతి కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణాలు, అన్ని ప్రముఖ కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 611 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. వీటిలో ఒక్క శ్రీకాకుళంలోనే 110 సీసీ కెమెరాలు ఉన్నా యని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఉన్నమాట వాస్తవమే కానీ అనేక చోట్ల అవి పని చేయడం లేదన్నది నిజం.  సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానం చేస్తూ ఎస్పీ బంగ్లా ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 2017 నుంచి ఇది పని చేస్తున్నా నిర్వహణ లోపం కొట్టొచ్చి నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ వ్యవస్థ గాడిలో పడినా నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుపారీ గ్యాంగులతో హత్యలు

2019 ఫిబ్రవరి 7న బొందిలీపురంలో జరిగిన జంట హత్యలతో సిక్కోలు ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ నేరం జరిగి నాలుగేళ్లైనా ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. హత్య చేసినవారెవరన్నది ఇప్పటి వరకు గుర్తించ లేకపోయారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానితులను గుర్తించినా, దర్యాప్తులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. కేసు దర్యాప్తునకు ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ దర్యాప్తు సాగుతోందనే పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సుపారి గ్యాంగ్‌ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. డబ్బు, అక్రమ సంబంధం జంట హత్యలకు కారణమన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏడాది క్రితం జులై 25న జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విజయాదిత్య పార్కులో సీపన్నాయుడుపేటకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఛేదించిన ఎచ్చెర్ల పోలీసులు హత్య వెనుక విజయనగరానికి చెందిన సుపారీ గ్యాంగ్ ఉందని గుర్తించారు. వారికి సుపారీ ఇచ్చిన మహిళను కటకటాల వెనక్కి పంపించారు. డబ్బు, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు.

ఈ ఏడాది జనవరి 18న నగరంలోని పాత మురళీ థియేటర్ సమీపంలోని మధురానగర్‌లో గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ పై కాల్పులు జరిగాయి. ఆదివారంపేటకు చెందిన ఒక మహిళ ఈ పని చేయించినట్టు తేలింది. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న సర్పంచ్ ఫిర్యాదుతో నిందితురాలిని, సుపారీ బ్యాచ్‌ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. అక్రమ సంబంధంతో ముడిపడి ఉన్న ఈ కేసులోనూ నిందితులు డబ్బు డిమాండ్ చేసినట్టు విచారణలో తేలింది.

ఈ నెల 11న జరిగిన డాక్టర్ గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారంలోనూ డబ్బు పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. విశాఖపట్నం సుజాతనగర్‌కు చెందిన వారికి సుపారీ ఇచ్చి సోమేశ్వరరావును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో దొరికిపోయిన పరమేష్ ఇచ్చిన సమాచారంతో నగరానికి చెందిన రవితేజను అదుపులోకి తీసుకున్నారు. రవితేజ ఇచ్చిన సమాచారంతో చందు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజు కోసం విశాఖపట్నంలో పోలీసులు గాలిస్తున్నారు. అతను చిక్కితే తప్ప కేసు ఒక కొలిక్కి రాదని చెబుతున్నారు పోలీసులు. విచారణలో చందు, రవితేజ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు విశ్వసించడం లేదని తెలిసింది. 

డాక్టర్ సోమేశ్వరరావుతో సన్నిహితంగా ఉండే చందు ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. సోమేశ్వరరావుకు చెందిన బ్లిస్ జిమ్‌ను చందు లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఏడాది కాలంగా అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెట్టాడని తెలిసింది.  అద్దె బకాయి ఎగ్గొట్టి మరికొంత మొత్తాన్ని గుంజుకోవడానికి కిడ్నాప్ స్కెచ్ వేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం దుండగులు ఎంతకైనా తెగిస్తారని గతంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, ఇటీవల జరిగిన కిడ్నాప్ ప్రయత్నం ద్వారా స్పష్టమవుతోంది.

Published at : 16 Aug 2022 05:18 PM (IST) Tags: Andhra Pradesh news srikakulam news srikakulam crime news Srikakulam Updates

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?