Hyderabad: భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం తెలిసి పోలీసులు షాక్
వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను కిడ్నాప్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. హైదరాబాద్‌లోని మౌలాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఘటనల్లో చాలా వరకూ నిందితులు ఎంతటి నేరం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ప్రియుడి కోసం భర్తను హత్య చేయడం లేదా ప్రియురాలి కోసం భార్యను వదిలించుకొనే క్రమంలో నేరాలకు పాల్పడిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను కిడ్నాప్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. హైదరాబాద్‌లోని మౌలాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలివీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ వాజీద్ (31), ఆప్షియా బేగం(24) ఇద్దరు భార్యాభర్తలకు 2012లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షేక్ వాజీద్ అనే వ్యక్తి బస్టాండ్ ప్రాంతంలో చెప్పుల షాపులో సేల్స్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే చురుగ్గా ఉండే ఆప్షియా బేగానికి ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్ పనులు చేసే ఆసిఫ్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారి మధ్య రిలేషన్ చాలా దూరం వెళ్లింది. ఆసిఫ్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారని తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, ఏం మాయమాటలు చెప్పారో ఏమో తెలియదు కానీ.. ఆప్షియా బేగం గత ఏప్రిల్‌లో ఇంట్లో చెప్పకుండా ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను గుర్తించారు. అనంతరం ఆమె భర్తకు అప్పగించారు.
Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ వినకుండా మరోసారి ఈసారి పిల్లలను కూడా తీసుకొని ప్రియుడి వద్దకే వెళ్లిపోవడంతో అత్తామామల సహాయంతో తిరిగి తీసుకొచ్చారు. భర్తతో ఉండటం ఇష్టం లేదని.. విడాకుల కావాలని ఆమె మొండికేసి కూర్చుంది. అందుకు అతడు విడాకులు ఇవ్వబోనని అన్నారు. ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆప్షియా బేగం అతడితో కలిసి కిడ్నాప్ స్కెచ్ వేసింది. దీంతో ఆసిఫ్ ముషీరాబాద్, పార్సి గుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్ (31), మహ్మద్ జాఫర్ (33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్ అనే వ్యక్తులను ఇందుకోసం మాట్లాడాడు.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులు అలా కనిపించవు
వీరు నలుగురు రెండు బైక్‌లపై సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో వాజీద్ పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి అతడిని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. ముషీరాబాద్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అప్పటికే వారు సిద్ధం చేసుకుని ఉంచిన మత పెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించుకున్నారు. వాజీద్ కిడ్నాప్ విషయాన్ని అదే రోజు రాత్రి షాపు ఓనర్స్ మార్కెట్ పోలీసులకు తెలియజేశారు. బాధితుడి ఫోన్ లోకేషన్ ఆధారంగా వాజీద్‌ను కాపాడారు. ఆప్షియా బేగంతోపాటు కిడ్నాప్‌నకు పాల్పడిన ఇమ్రాన్ అహ్మద్, జాఫర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఆసిఫ్‌తోపాటు ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి