Hyderabad News: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...
హైదరాబాద్ మణికొండలో రెండు రోజుల క్రితం డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడి మృతదేహాం సోమవారం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే చెరువులో మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మణికొండలో రెండు రోజుల క్రితం డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్ అనే యువకుడు మృతదేహం సోమవారం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మూడు కిలోమీటర్ల దూరంలో రజనీకాంత్ మృతదేహం కొట్టుకొచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. గోపిశెట్టి రజినీకాంత్ షాద్ నగర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడిపోయారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రజనీకాంత్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ వెళ్లే మార్గంలో గాలించారు.
Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
శనివారం రాత్రి ప్రమాదం
గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత గాలింపు కొనసాగించారు. నెక్నాంపూర్ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగించగా రజినీకాంత్ మృతదేహాన్ని బయటపడింది. మణికొండలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సెక్రటేరియట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి వరదనీరు చేరింది. రాత్రి 9.15గంటల సమయంలో కాలినడకన వెళ్తున్న రజనీకాంత్ ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు.
Also Watch: ఏపీలో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రహదారులు
అధికారుల నిర్లక్ష్యం
ఈ ప్రమాద దృశ్యాలు ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా అందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు, మణికొండ మున్సిపల్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో డ్రైనేజీ పొడవునా గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్! మరో 3 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్, హెచ్చరికలు
Also Read: మణికొండలో గల్లంతైన వ్యక్తి ఎవరో తెలిసింది.. 12 గంటల నుంచి నాలాలు, చెరువుల్లో ఆయన కోసం గాలింపు
Also Read: బీడీ కోసం గొడవ.. ప్రత్యర్థిని చంపుదామని కత్తి తీసుకెళ్లిన వ్యక్తి, చివరికి ట్విస్ట్ మామూలుగా లేదు!