By: ABP Desam | Updated at : 21 Apr 2022 12:23 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. నార్సింగిలోని ఓ ఫ్లాట్‌లో హైటెక్ పద్ధతిలో ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని నిర్వహకులు ఉగాండా దేశస్తులు అని పోలీసులు నిర్ధరించారు. వారిని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడం కోసం ఈ ఉగాండా దేశీయులు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరూ వీఐపీలేనని గుర్తించారు. ఈ వ్యభిచార యాప్‌ను బ్యాంకు యాప్ మాదిరిగా ప్రత్యేక సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ముందుగా బుక్ చేసుకున్న ప్రకారం ప్రత్యేక కోడ్ లేదా ఓటీపీ వాడితేనే లోనికి రానిచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నారు. ఆ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
విటుడు డబ్బు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటిలోకి, మహిళ వద్దకు వెళ్లేందుకు ఆ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ వెంటనే నిర్వహకులు కస్టమర్ ఫోన్ నుంచి సంప్రదించిన వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. అలా చేయడం ద్వారా వినియోగదారుడు ఆ డేటాను దుర్వినియోగం చేయకుండా వీలు ఉంటుందని పోలీసులు వివరించారు. హైటెక్ పద్ధతిలో ఇలాంటి సెక్స్ రాకెట్‌ను ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు.
జీడిమెట్లలోనూ..
జీడిమెట్లలోనూ మరో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు అనే 33 ఏళ్ల వ్యక్తి జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వహకుడు వీరరాజు సహా విటుడిపై కేసు నమోదు చేశారు.
ఓ మహిళను వ్యభిచార కూపంలోకి దింపాలని యత్నించిన ఓ వ్యక్తికి మేడ్చల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.వెయ్యి జరిమానా విధించింది. 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ వచ్చేందుకు కర్నూల్ బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉంది. ఇది గమనించిన అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్ రెడ్డి ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాటలు కలిపి.. తనవెంటనే హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెబుతూ.. వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. ముందుగానే అప్రమత్తమైన సదరు మహిళ.. అతని నుంచి తప్పించుకుని.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్